రాజ్‌భవన్‌లో ప్రొటెం స్పీకర్ ప్రమాణస్వీకారోత్సవం జరిగింది. తెలంగాణ శాసనసభ ప్రొటెమ్ స్పీకర్(Assembly proteome speaker)గా ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ(Akbaruddin Owaisi)తో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్(Governor Tamilisai soundararajan) ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ మేరకు అక్బరుద్దీన్‌తో పాటు.. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క రాజ్‌భవన్ చేరుకున్నారు.
మరికొద్ది సేపట్లో తెలంగాణ అసెంబ్లీలో ఎమ్మెల్యేల ప్రమాణస్వీకారం జరగనుంది. ఈ మేరకు శాసనసభ ప్రొటెమ్ స్పీకర్‌గా ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ తో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రమాణ స్వీకారం అనంతరం అక్బరుద్దీన్‌కు గవర్నర్, సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ప్రమాణస్వీకారం అనంతరం అక్బరుద్దీన్ అసెంబ్లీలో కొత్త ఎమ్మెల్యేలతో ప్రమాణం చేయించనున్నారు.
ఉదయం 11 గంటలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. తెలంగాణ సీఎం హోదాలో రేవంత్‌రెడ్డి తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టనున్నారు. అసెంబ్లీలో ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం అనంతరం కాంగ్రెస్ ప్రభుత్వ పాలన ఏవిధంగా ఉండనుందో రేవంత్‌రెడ్డి ప్రసంగించనున్నారు.
అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజార్టీతో అధికారాన్ని కైవసం చేసుకున్న కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుని హామీల అమలుపై దృష్టి పెట్టింది. మరోవైపు బీఆర్ఎస్ నేతలు ప్రభుత్వ హామీలు, అమలు తీరును గమనిస్తున్నారు. తేడా వస్తే ఆందోళనలు చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.