రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మొన్నటి వరకు ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారంతో బిజీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే.. ఆ పర్వం ముగిశాక, తాజాగా స్పీకర్ నియామకంపై రాష్ట్ర సర్కార్ దృష్టి పెట్టింది. ఈ మేరకు స్పీకర్ ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈనెల 14వ తేదీ ఉదయం 10.30 గంటలకు సభాపతి ఎన్నికను నిర్వహించనున్నారు.
ఈమేరకు స్పీకర్ ఎన్నికకు (Speaker Election) నామినేషన్లును ఈనెల 13న ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు స్వీకరిస్తారు. మరోవైపు రాష్ట్రంలో కాంగ్రెస్ గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగానే అంతకు ముందు ఉన్న శాసనసభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి రాజీనామా చేశారు. ఈ క్రమంలో సీనియర్ నాయకుడు, వికారాబాద్ ఎమ్మెల్యే, గడ్డం ప్రసాద్ కుమార్ (Gaddam Prasad Kumar)ను స్పీకర్ గా కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించిన విషయం తెలిసిందే.
ఈనేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన ఒక్కరే నామినేషన్ వేయనున్నట్లు సమాచారం. అనంతరం ఏకగ్రీవంగా గడ్డం ప్రసాద్‌నే స్పీకర్‌గా ఎన్నుకునే అవకాశం కనిపిస్తోందని టాక్ వినిపిస్తోంది. కాగా ఉమ్మడి రాష్ట్రంలో కిరణ్‌కుమార్ రెడ్డి ప్రభుత్వంలో.. ప్రసాద్ కుమార్‌కు మంత్రిగా పని చేసిన అనుభవం ఉంది. అలాగే ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నిక (Assembly Election)ల్లో గడ్డం ప్రసాద్ వికారాబాద్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు.
ఇదిలా ఉండగా ఇప్పటికే ప్రొటెం స్పీకర్ (ProTem Speaker)గా అక్బరుద్దీన్ ఓవైసీ ఎన్నికైన విషయం తెలిసిందే.. అనంతరం 100 మంది ఎమ్మెల్యేలతో ప్రమాణస్వీకారం కూడా చేయించారు. అయితే బీజేపీకి చెందిన 8 మంది ఎమ్మెల్యేలు.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ను, ప్రొటెం స్పీకర్‌గా నియమించడాన్ని వ్యతిరేకిస్తూ ప్రమాణ స్వీకారాన్ని నిరాకరించారు..