Telugu News » Telangana BJP : తెలంగాణ బీజేపీలో కొత్త టీమ్‌.. లోక్‌సభలో 400 సీట్లు టార్గెట్‌..!!

Telangana BJP : తెలంగాణ బీజేపీలో కొత్త టీమ్‌.. లోక్‌సభలో 400 సీట్లు టార్గెట్‌..!!

తాజాగా అమిత్‌ షా టూర్‌ తర్వాత, ఈ ప్రక్రియ జోరందుకుంది. ఇప్పటికే పార్టీ ప్రధాన కార్యదర్శులతో కిషన్‌రెడ్డి చర్చలు జరిపారు. అంతేగాదు, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన వారిపై కిషన్‌రెడ్డి ఫోకస్‌ చేశారు. వారిపై వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా బీజేపీ క్రమశిక్షణ కమిటీ భేటీ అయింది.

by Venu

తెలంగాణ (Telangana) రాజకీయాల్లో పార్లమెంటు ఎన్నికల ముందు కీలక మార్పులు చోటు చేసుకొనున్నాయనే వార్తలు చక్కర్లు కొడుతోన్నాయి.. ఇందులో భాగంగా బీజేపీ (BJP) కొత్త సంవత్సరంలో, కొత్త నిర్ణయాలతో ముందుకు వెళ్లాలనే ఆలోచనలతో ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే కాషాయ సైన్యంలో సంస్థాగత ప్రక్షాళనపర్వానికి రంగం సిద్ధమైందనే గుసగుసలు వినిపిస్తోన్నాయి..

bjp-big-plans-for-parliament-elections

తెలంగాణలో ఉన్న 15 జిల్లాలకు కొత్త కెప్టెన్లు వస్తున్నట్టు రాజకీయ వర్గాలలో చర్చ మొదలైంది. పార్టీ బలోపేతం పై దృష్టి సారించిన అధిష్టానం.. ఆరోపణలు వచ్చిన వారిని, సరిగా పనిచేయని వారిని పక్కనబెట్టడం. దీర్ఘకాలంగా అధ్యక్షులుగా కొనసాగుతున్నవారికి ఆ పదవుల నుంచి ఉద్వాసన పలకడం గ్యారంటీ అంటున్నారు. ఈ మార్పులపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి (Kishan Reddy) ఇప్పటికే కసరత్తులు ప్రారంభించినట్టు తెలుస్తోంది.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో BJPకి ఎనిమిది సీట్లు వచ్చాయి. ఈ జోష్‌ పార్లమెంటు ఎన్నికల్లో కంటిన్యూ కావాలంటే, మార్పులు తప్పనిసరి భావించిన అధిష్టానం.. మార్పులకి గ్రీన్‌సిగ్నల్‌ కూడా ఇచ్చిందని అంటున్నారు.. అదీగాక లోక్‌సభలో 400 సీట్లు టార్గెట్‌ పెట్టుకున్న బీజేపీ హైకమాండ్‌.. తెలంగాణలో పది సీట్లు సాధించాలని లక్ష్యం నిర్దేశించినట్టు సమాచారం.. ఈ టార్గెట్‌ను చేరుకోవాలంటే, కొత్త టీమ్‌ కావాలి. అందుకే కిషన్‌రెడ్డి ఆ దిశగా ప్రణాళికలు సిద్దం చేస్తున్నారని అంటున్నారు..

తాజాగా అమిత్‌ షా టూర్‌ తర్వాత, ఈ ప్రక్రియ జోరందుకుంది. ఇప్పటికే పార్టీ ప్రధాన కార్యదర్శులతో కిషన్‌రెడ్డి చర్చలు జరిపారు. అంతేగాదు, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన వారిపై కిషన్‌రెడ్డి ఫోకస్‌ చేశారు. వారిపై వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా బీజేపీ క్రమశిక్షణ కమిటీ భేటీ అయింది. రేపో మాపో, వీళ్లకు కూడా కమిటీ నోటీసులు ఇస్తుందని ప్రచారం జరుగుతోంది.. మొత్తానికి ఈ మార్పు బీజేపీ బలాన్ని పెంచుతుందో లేదో ఎన్నికల తర్వాత తెలుస్తుంది..

You may also like

Leave a Comment