Telugu News » Telangana : రేవంత్ ప్లాన్ కు హడాలిపోతున్న బీఆర్ఎస్ నేతలు.. అవినీతి దాచడానికేనా అబద్ధాలు..!

Telangana : రేవంత్ ప్లాన్ కు హడాలిపోతున్న బీఆర్ఎస్ నేతలు.. అవినీతి దాచడానికేనా అబద్ధాలు..!

ప్రస్తుతం కేంద్రంలో చ‌క్రం తిప్పుడు మాట దేవుడెరుగు.. రాష్ట్రంలో బీఆర్ఎస్ ఉనికి మాయం కాకుండా కాపాడుకొనేందుకు ప‌డ‌రానిపాట్లు ప‌డాల్సి ప‌రిస్థితి ఏర్ప‌డింది. అయితే సీఎం రేవంత్ (Revanth Reddy) మాత్రం బీఆర్ఎస్ నేతలకు నిద్రపట్టకుండా చేస్తున్నారని అనుకొంటున్నారు.

by Venu
congress-leaders-are-criticizing-brs-leaders

పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తుండటంతో కాంగ్రెస్ (Congress) దూకుడు పెంచింది. అసెంబ్లీ ఎన్నికల ముందు ప్రధాన అస్త్రంగా బీఆర్ఎస్ అవినీతిని ప్రజల్లోకి తీసుకెళ్ళి విజయాన్ని అందుకోగా.. ప్రస్తుతం ఇదే అంశంపై మరోసారి వాదనలు వినిపిస్తోంది. అయితే బీఆర్ఎస్ అధికారం కోల్పోయాక మౌనంగా ఉంటున్న కేసీఆర్ ఇప్పటి వరకు కూడా కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలపై పెదవి విప్పకపోవడంతో హస్తం నేతల అనుమానాలకు బలం చేకూరుస్తుందని అనుకొంటున్నారు.

working for 18 hours every day cm revanths made interesting comments

మరోవైపు త్వరలో బీఆర్ఎస్ (BRS) మళ్ళీ అధికారంలోకి రావడం ఖాయమని నోటికి మైకు కట్టుకొని ప్రచారం చేసుకొంటున్న గులాబీ నేతలు.. పార్టీ నుంచి నేతలు జారిపోకుండా చూసుకునే క్రమంలో ఆశలు కల్పిస్తున్నారని. అందుకే కేటీఆర్ (KTR).. హరీష్ రావు (Harish Rao) మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. అయితే గులాబీ పార్టీని జాతీయ స్థాయిలో విస్త‌రించాల‌ని టీఆర్ఎస్ పేరును కాస్తా బీఆర్ఎస్‌గా మార్చేసిన కేసీఆర్‌కు తెలంగాణ ఓట‌ర్లు ఇచ్చిన షాక్ అయోమయంలో పడేసిందని అంటున్నారు.

ప్రస్తుతం కేంద్రంలో చ‌క్రం తిప్పుడు మాట దేవుడెరుగు.. రాష్ట్రంలో బీఆర్ఎస్ ఉనికి మాయం కాకుండా కాపాడుకొనేందుకు ప‌డ‌రానిపాట్లు ప‌డాల్సి ప‌రిస్థితి ఏర్ప‌డింది. అయితే సీఎం రేవంత్ (Revanth Reddy) మాత్రం బీఆర్ఎస్ నేతలకు నిద్రపట్టకుండా చేస్తున్నారని అనుకొంటున్నారు. దీనికి కారణం బీఆర్ఎస్ హ‌యాంలో కేసీఆర్ (KCR) ఆధ్వ‌ర్యంలో ప‌లు ప్రాజెక్టుల నిర్మాణాలు జ‌రిగాయి. వాటిలో ముఖ్య‌మైంది కాళేశ్వ‌రం ప్రాజెక్టు. కాళేశ్వ‌రం ప్రాజెక్టులో భారీ ఎత్తున అవినీతి జ‌రిగింద‌ని గ‌తంలో ప్ర‌తిప‌క్షంలో ఉన్న కాంగ్రెస్ నేత‌లు గొంతు చించుకొన్నారు.

కానీ కేసీఆర్ అధికారంలో ఉన్నారు కాబట్టి వాటికి విలువ లేకుండా పోయింది. ప్ర‌స్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావ‌డం, సీఎంగా రేవంత్ రెడ్డి బాధ్య‌త‌లు చేప‌ట్ట‌డంతో గ‌త ప్ర‌భుత్వం హ‌యాంలో ప్రాజెక్టుల నిర్మాణాల్లో జ‌రిగిన అవినీతిపై గురి పెట్టారు. ముఖ్యంగా కాళేశ్వ‌రం ప్రాజెక్టులో జ‌రిగిన అవినీతిని తేల్చేందుకు జ్యూడీషియ‌ల్‌, విజిలెన్స్ విచార‌ణ‌కు ఆదేశించారు. అదీగాక అసెంబ్లీ స‌మావేశాల్లో ఇరిగేష‌న్ డిపార్ట్మెంట్ పై ప్ర‌భుత్వం శ్వేత‌ప‌త్రం విడుద‌ల చేసేందుకు సిద్ధ‌మైంది.

మూలిగే న‌క్క‌పై తాటిపండు ప‌డ్డ చందంగా ఈనెల 13న మేడిగ‌డ్డ ప‌ర్య‌ట‌న‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం సిద్ధ‌మైంది. అయితే బీఆర్ఎస్ లో ఇంకా కొనసాగుతున్న నేతలకు తమ అవినీతి బయటపడి ఎన్ని ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుందో అనే భయాన్ని రేవంత్ రుచి చూపిస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. కేసీఆర్ ను నమ్ముకొని అలాగే పార్టీలో కొనసాగితే.. అధికార పార్టీ చుక్కలు చూపించడం ఖాయమని అర్థమైన నేతలు ప్రస్తుతం ఆలోచనలో పడినట్లు తెలుస్తోంది.

అయితే బీఆర్ఎస్ హయాంలో జరిగిన అవినీతిని కేటీఆర్ అంగీకరించడం లేదని తెలుస్తోంది. రాజకీయ లబ్ధి కోసం కాంగ్రెస్ చిన్న విషయాన్ని భూతద్దంలో పెట్టి చూస్తోందని ఆరోపణలు చేస్తున్నారు. ఇక కేసీఆర్ అయితే కనీసం సమాధానం కూడా ఇవ్వకపోవడం చర్చకు దారితీస్తోంది. మరోవైపు న‌ల్గొండ జిల్లాలో 13న బీఆర్ఎస్ పార్టీ బ‌హిరంగ స‌భ ఏర్పాటు చేశారు. ఈ బ‌హిరంగ స‌భ‌లో కేసీఆర్ ఏం మాట్లాడుతారు? రేవంత్ ప్ర‌భుత్వం కాళేశ్వ‌రం ప్రాజెక్టుల‌పై చేస్తున్న వాద‌న‌ల‌కు ఏవిధంగా స‌మాధానం చెబుతార‌నే ఉత్కంఠ ప్ర‌జ‌ల్లో నెలకొంది.

You may also like

Leave a Comment