ప్రస్తుతం బీఆర్ఎస్ (BRS) ఉన్న పరిస్థితి.. ఉద్యమ సమయంలో కూడా ఎదుర్కొనలేదని అనుకొంటున్నారు.. ఒకవైపు ఖాళీ అవుతున్న పార్టీ.. కూతురు జైల్లో.. పట్టుబట్టి బయటికి తీసున్న అవినీతి.. అక్రమాలు.. స్కామ్ లు.. మేధావి అని ఇన్నాళ్ళూ అనుకొన్న పెద్ద బాస్ ప్రస్తుతం.. పార్టీని బ్రతికించే పనిలో తలమునకలు అవ్వడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.. ఒకవైపు లోక్ సభ ఎన్నికల వేడి రాజుకుంది.
ప్రధాన పార్టీలు గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్నాయి.. ప్రత్యర్థులపై విమర్శల బాణాలతో బరిలోకి దిగాయి.. ఈ నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చవిచూసిన బీఆర్ఎస్.. పార్లమెంట్ ఎన్నికల్లో తమ బలాన్ని నిరూపించుకోవాలని తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే కీలక నేతలందరు పార్టీకి బై చెప్పి పక్క పార్టీలోకి వలస వెళ్ళిన సంగతి తెలిసిందే.. దీంతో పార్లమెంట్ ఎన్నికల్లో కాస్త మెజారిటీ సాధించి.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల వరకు పుంజుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలో సార్వత్రిక ఎన్నికలను సీరియస్ గా తీసుకొన్న గులాబీ పార్టీ.. అధికార కాంగ్రెస్ (Congress) పార్టీని ఇరుకున పెట్టడమే లక్ష్యంగా ప్రణాళికలు సిద్దం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈమేరకు ప్రభుత్వ వైఫ్యలాలను ఎండగట్టి అధికార పార్టీని దెబ్బ కొట్టాలనే నిర్ణయానికి వచ్చినట్లు టాక్ వినిపిస్తోంది.. ఇందుకు కొత్త మార్గాన్ని ఎంచుకొన్న బీఆర్ఎస్.. హస్తం 100 రోజుల వైఫల్యాలపై పోస్టు కార్డు ఉద్యమానికి సిద్దం అవుతున్నట్లు సామాచారం..
మరోవైపు మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు (Harish Rao) కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలపై పోస్టు కార్డ్ ఉద్యమం చేస్తామని ప్రకటించారు. రాష్ట్ర రైతుల పక్షాన సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy)కి పోస్ట్ కార్డులు పంపుతామని పేర్కొన్నారు.. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నేరవేర్చాకే పార్లమెంట్ ఎలక్షన్స్‌లో ఓట్లు అడగాలని డిమాండ్ చేశారు.. నాలుగు నెలల్లోనే ప్రభుత్వంపై వ్యతిరేకత ఏర్పడిందని ఆరోపించారు..