అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లు ఇచ్చిన షాక్ నుంచి ఇప్పుడిప్పుడే కొలుకొంటునట్లు మత్తు వదిలించుకొంటున్న టీఆర్ఎస్ అలియాస్ బీఆర్ఎస్ (BRS) పార్టీ పేరు మార్పుపై గతంలో తీవ్రమైన అభ్యంతరాలు వ్యక్తం అయిన విషయం తెలిసిందే.. అయితే ఏదైనా అనుభంలోకి వస్తే కానీ దాని విలువ అర్థం అవదని అంటారు. ప్రస్తుతం గులాబీ పరిస్థితి పాతాళానికి పడిపోతుందని గమనించిన నేతలు పేరు మార్పుపై కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు.
అసలే పార్లమెంట్ ఎన్నికలు దగ్గరపడుతున్నాయి.. కనీసం ఇప్పుడైనా బోణి కొడదామనే ప్రయత్నంలో భాగంగా ఇప్పటికే బీఆర్ఎస్ భవనంలో వాస్తు మార్పులకు శ్రీకారం చుట్టినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే సమయంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు (Errabelli Dayakar Rao) సంచలన వ్యాఖ్యలు చేశారు. పాలకుర్తి (Palakurti) నియోజకవర్గంలో చేపట్టిన దీక్షలో పాల్గొన్న ఆయన.. రైతుల కోసం బీఆర్ఎస్ పోరుబాటపట్టిందన్నారు..
రాష్ట్రవ్యాప్తంగా కేసీఆర్ (KCR) పిలుపుతో పార్టీ కార్యకర్తలు రైతు దీక్షలు ప్రారంభించినట్లు పేర్కొన్నారు.. అలాగే పార్టీ పేరు మార్చే భావనలో ఉన్నట్లు వెల్లడించారు. బీఆర్ఎస్ ను మళ్ళీ టీఆర్ఎస్ గా మార్చేందుకు కసరత్తు ప్రాభించినట్లు పేర్కొన్నారు.. పార్టీ పేరు మారిన తర్వాత పెద్దగా కలిసి రావడం లేదని అనుమానం వ్యక్తం చేశారు. ఈ మార్పుపై ప్రజల్లో కూడా వ్యతిరేకత వ్యక్తమైందని గుర్తు చేశారు..
మరోవైపు బీఆర్ఎస్ పేరుతో ప్రజల్లోకి వెళ్లలేకపోతున్నట్లు క్షేత్రస్థాయి లీడర్లు అధిష్టానం వద్ద మొరపెట్టుకొన్న విషయాన్ని గుర్తుచేశారు. అదీగాక టీఆర్ఎస్ (TRS) పేరుతో రెండుసార్లు అధికారంలోకి వచ్చిన పార్టీ.. పేరు మార్చగానే అధికారం కోల్పోయిందని గతాన్ని తవ్వారు.. ఉద్యమ పార్టీగా పేరున్న టీఆర్ఎస్ మళ్ళీ అధికారంలోకి తప్పకుండా వస్తుందనే ధీమా వ్యక్తం చేశారు..