Telugu News » Smriti Irani: ‘ఢిల్లీలో హగ్గింగ్.. కేరళలో బెగ్గింగ్..’ రాహుల్‌పై కేంద్రమంత్రి సంచలన వ్యాఖ్యలు..!

Smriti Irani: ‘ఢిల్లీలో హగ్గింగ్.. కేరళలో బెగ్గింగ్..’ రాహుల్‌పై కేంద్రమంత్రి సంచలన వ్యాఖ్యలు..!

కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) వయనాడ్ నుంచి పోటీ చేయడంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రాహుల్ అక్కడే ఎందుకు పోటీ చేస్తున్నాడని ప్రశ్నించారు.

by Mano
Smriti Irani: 'Hugging in Delhi.. Begging in Kerala..' Central Minister's sensational comments on Rahul..!

కేరళ(Kerala)లోని వయనాడ్(Vayanad)లో బీజేపీ అభ్యర్థి కె.సురేంద్రన్‌(Surendran)కు మద్దుతుగా కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ(Smriti Irani) ప్రచారం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) వయనాడ్ నుంచి పోటీ చేయడంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రాహుల్ అక్కడే ఎందుకు పోటీ చేస్తున్నాడని ప్రశ్నించారు.

Smriti Irani: 'Hugging in Delhi.. Begging in Kerala..' Central Minister's sensational comments on Rahul..!

యూపీలో పోటీ చేయొచ్చు కదా అని ఇండియా కూటమిలోని వామపక్ష పార్టీలే ప్రశ్నిస్తున్నాయన్నారు. వారిని రాహుల్ ఢిల్లీలో కౌగిలించుకొని.. కేరళలో మాత్రం సీటు కోసం అడుక్కుంటున్నారంటూ స్మృతి ఇరానీ ఎద్దేవా చేశారు. వయనాడ్‌లో రాహుల్ గాంధీ పోటీ చేయడాన్ని ఆ రాష్ట్ర సీఎం పినరాయి విజయన్ తప్పబట్టారని గుర్తు చేశారు.

‘ఢిల్లీ మే హగ్గింగ్, కేరళ మే బెగ్గింగ్, కర్ణాటక మే థగ్గింగ్’ అంటూ రాహుల్‌పై విమర్శలు గుప్పించింది. మహిళలు భారీ సంఖ్యలో బీజేపీకి ఓట్లు వేయాలని అభ్యర్థించారు. ఓట్లు వేయడం ఏ టీవీ సీరియల్‌లో ఆట కాదని వ్యాఖ్యానించారు. ఇది బాధ్యతతో కూడినదని, ప్రతీ ఒక్క మహిళ సీరియస్‌గా రాజకీయ విషయాలపై దృష్టి పెట్టాలని సూచించారు.

‘సాస్-బాహు’ సీరియల్స్ జీవితాలు వాస్తవాలకు చాలా దూరంగా ఉన్నాయని తెలిపారు. అయితే, కాంగ్రెస్ ఇప్పటికీ బలమైన ఉనికిని కలిగి ఉన్న కొన్ని రాష్ట్రాల్లో కేరళ ఒకటి.. ఇక్కడి నుంచి 20 మంది ఎంపీలు లోకసభకు ప్రతినిధ్యం వహిస్తున్నారు. 2019 లోక్‌సభ ఎన్నికలలో రాహుల్ గాంధీ వయనాడ్ నుంచి 4.31 లక్షల ఓట్ల భారీ ఆధిక్యంతో విజయం సాధించారు.

You may also like

Leave a Comment