కాంగ్రెస్ (Congress) ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌పై పలువురు బీఆర్ఎస్ (BRS) నేతల విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. ఓటాన్ అకౌంట్ (Otan Account) బడ్జెట్ పూర్తిగా నిరాశపర్చిందన్నారు.. శాసన మండలి మీడియా పాయింట్‌లో మాట్లాడుతూ.. ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్లో బడ్జెట్ లో ఒక్క హామీ గురించి చెప్పలేదన్నారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని విమర్శించడానికే బడ్జెట్ ప్రసంగం సరిపోయిందని అసహనం వ్యక్తం చేశారు. బడ్జెట్ ప్రసంగంతో ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని తేలిపోయిందని విమర్శించారు. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ లో పూర్తి కేటాయింపు లేకపోయినా.. రానున్న 5 ఏండ్ల ప్రణాళికకు సంబంధించిన అంశాలు పొందుపరచకుండానే పైపైన బడ్జెట్ ని ప్రవేశపెట్టారని ఆరోపించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిన బడ్జెట్‌లో రాష్ట్రంలో ప్రగతి గేర్చు మార్చే అంశాలేవి లేవన్నారు. ఆశా వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా చూస్తామన్నారు.. కానీ బడ్జెట్ ప్రసంగంలో ఆ ప్రస్తావనే లేదన్నారు. ఈ ప్రభుత్వం ఓన్లీ నేమ్ చేంజింగ్ మాత్రమే, గేమ్ చేంజర్ కాదని తెలిపోయిందని విమర్శించారు. గత ప్రభుత్వాలును విమర్శించడానికే సమావేశాలు పెట్టిన్నట్టు ఉందన్నారు.మరోవైపు బడ్జెట్ పై సత్యవతి రాథోడ్ స్పందించారు.. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ నిరాశజనకంగా ఉందన్నారు
మహిళా సంక్షేమం కోసం కేటాయింపులు, ప్రతిపాదనలు లేకుండానే సమావేశాలు నిర్వహించారని విమర్శించారు. ఉచిత ప్రయాణ సౌకర్యం పై మేము హర్షం వ్యక్తం చేసాము. కాని దాని ద్వారా ఇబ్బందులు పడుతున్న ఆటో కార్మికులుకు న్యాయం చేయమని కోరామన్నారు. మహా లక్ష్మి పథకానికి ఎంత బడ్జెట్ అన్న విషయం చెప్పలేదు. కానీ మాట్లాడితే గత ప్రభుత్వం అప్పులు చేసింది అని ఆరోపణలు చేస్తున్న వారు.. 10 ఏండ్లలో ప్రతిపక్షంలో ఉండి కాగ్ రిపోర్ట్ చూడలేదా అని ప్రశ్నించారు.