147
2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ( vote-on-account contains)ను తెలంగాణ ప్రభుత్వం ప్రవేశ పెట్టింది. ఈ ఆర్థిక సంవత్సరానికి రూ.2,75,891 కోట్లతో ఈ బడ్జెట్ ను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) ప్రవేశ పెట్టారు. ఈ బడ్జెట్ లో రూ.2,01,178 కోట్లను రెవెన్యూ వ్యయంగా, రూ.29,669 కోట్ల మూలధన వ్యయంతో పద్దులను ప్రభుత్వం ప్రతిపాదించింది.
భట్టి విక్రమార్క ప్రసంగం
- రూ.2,75,891 కోట్లతో తెలంగాణ బడ్జెట్
రెవెన్యూ వ్యయం రూ.2,01,178 కోట్లు
మూలధన వ్యయం రూ.29,669 కోట్లు
ఆరు గ్యారెంటీలకు రూ.53,196 కోట్లు
వ్యవసాయానికి రూ.19,746 కోట్లు
ఐటీ శాఖకు రూ.774 కోట్లు
పురపాలక శాఖకు రూ.11,692 కోట్లు
మూసీ ప్రాజెక్టుకు రూ.1,000 కోట్లు
విద్యా రంగానికి రూ.21,389 కోట్లు
వైద్య రంగానికి రూ.11,500 కోట్లు
ఎస్సీ సంక్షేమ శాఖకు రూ.21,874 కోట్లు
గృహనిర్మాణానికి రూ.7,740 కోట్లు
మైనారిటీ సంక్షేమ శాఖకు రూ.2,262 కోట్లు - గత ప్రభుత్వ రైతు బంధుతో అనర్హులకే ఎక్కువ లబ్ధి
రైతు బంధు నిబంధనలను పున:సమీక్షిస్తాం
కౌలు రైతులకు కూడా రైతు భరోసా ఇస్తాం
పంటల బీమాను పటిష్టంగా అమలు చేస్తాం
వ్యవసాయానికి రూ.19,746 కోట్లు కేటాయించాం - లండన్ థేమ్స్ నది తరహాలో మూసీ అభివృద్ధి
మూసీ రివర్ ఫ్రంట్ ను అభివృద్ధి చేస్తాం- భట్టి
అతిపెద్ద టూరిజం స్పాట్ గా మూసీని డెవలప్ చేస్తాం
మూసీ అభివృద్ధి కోసం రూ.1000 కోట్లు - అభివృద్ధి వికేంద్రీకరణకు కట్టుబడి ఉన్నాం
పురపాలక శాఖకు రూ.11,692 కోట్లు
త్వరలోనే రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ - తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ కి రూ.500 కోట్లు
రాష్ట్రంలోని అన్ని ఐటీఐల్లో అదనంగా సీట్లు, కొత్త కోర్సులు
వర్సిటీల్లో మౌలిక వసతుల కల్పనకు రూ.500 కోట్లు
త్వరలో ఉస్మానియా ఆస్పత్రి నూతన భవనం ప్రారంభం
త్వరలో 15వేల కానిస్టేబుళ్ల రిక్రూట్ మెంట్ - టీఎస్పీఎస్సీ నిర్వహణకు రూ.40 కోట్లు
చేనేత కార్మికుల నుంచి స్కూల్ యూనిఫాంల కొనుగోలు
ఇందుకు త్వరలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు
200 యూనిట్ల ఉచిత విద్యుత్ కోసం రూ.2,418 కోట్లు
ట్రాన్స్ కో, డిస్కంలకు రూ.16,825 కోట్లు - కౌలు రైతులకు కూడా రైతు బీమా అమలు చేస్తాం- భట్టి
ఇందుకు త్వరలో మార్గదర్శకాలు విడుదల
ప్రజావాణిలో 2 నెలల్లో వచ్చిన దరఖాస్తులు 43,054
ఇళ్ల కోసం వచ్చిన దరఖాస్తులు 14,951
భూసమస్య కోసం వచ్చిన దరఖాస్తులు 8,927
పింఛన్ కోసం వచ్చిన దరఖాస్తులు 3,267
ఉద్యోగ కల్పన కోసం వచ్చిన దరఖాస్తులు 3,134 - ఆరోగ్య శ్రీ పరిమితి రూ.10 లక్షలకు పెంపు
ఆరు గ్యారెంటీల అమలుకు చిత్తశుద్ధితో ఉన్నాం
అర్హులైన అందరికీ ఆరు గ్యారెంటీలు అందుతాయి
ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం - కాంగ్రెస్ డిక్లరేషన్లలో ప్రకటించిన హామీలన్నీ నెరవేరుస్తాం
ఐటీ రంగం మరింత వృద్ధి చెందేలా నదూతన పాలసీ
రాష్ట్రం నలుమూలలకు ఐటీ కంపెనీలు
ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో ఐటీ కంపెనీలు - రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ త్వరలో కార్యాచరణ
ప్రతీ పంటకు మద్దతు ధర ఇస్తాం
రైతు భరోసా కింద ఎకరాకు రూ.15 వేలు
గత ప్రభుత్వ పథకాలు గొప్ప.. అమలు దిబ్బ
గత పాలకుల నిర్వాకంతో ధనిక రాష్ట్రంలో ఆర్థిక కష్టాలు
అప్పులను అధిగమించి అభివృద్ధిలో ముందడుగు వేస్తున్నాం - దేశ జీడీపీ వృద్ధిరేటుతో పోలిస్తే రాష్ట్ర వృద్ధిరేటు 2.4 శాతం ఎక్కువే
సంతులిత వృద్ధి కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం
ఆర్భాటాలు, ఆకర్షణలకు ప్రభుత్వం దూరంగా ఉంటుంది
వర్షాల ప్రభావం వల్ల పంట దిగుబడులు బాగా తగ్గాయి
వ్యవసాయంలో వృద్ధిలేమితో ఇతర రంగాలపై ప్రభావం పడింది - ఇప్పటికే దుబారా ఖర్చులను తగ్గించాం- భట్టి
గత ప్రభుత్వ బడ్జెట్ లు వాస్తవాలకు దూరంగా ఉన్నాయి
నిజమైన ప్రజాస్వామ్యం ఏంటో ప్రజలు చూస్తున్నారు - పాలకులు, ప్రజలకు మధ్య ఇనుప కంచెలను తొలగించాం- భట్టి విక్రమార్క
ప్రజల ఆకాంక్షలను నెరవేర్చి చూపిస్తాం
ఆర్థిక ఇబ్బందులున్నా హామీలు నెరవేర్చి తీరుతాం
అందుబాటులో ఉన్న వనరులతో హామీలను అమలు చేస్తాం
తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం వచ్చింది
ఆరు గ్యారెంటీలను కచ్చితంగా అమలు చేసి తీరుతాం - మార్పును కోరుతూ తెలంగాణ సమాజం స్వేచ్ఛను సంపాదించుకుంది
సమానత్వమే మా ప్రభుత్వ లక్ష్యం
తెలంగాణ అమరవీరులు దేనికోసం త్యాగాలు చేశారో వాటిని నెరవేరుస్తాం
నిజమైన ప్రజాస్వామ్యం ఏంటో ప్రజలు చూస్తున్నారు
సామాజిక న్యాయం చేసి చూపిస్తాం
ప్రజల కోసం మా ప్రభుత్వం ఎన్ని కష్టాలైనా భరిస్తుంది- భట్టి విక్రమార్క