Telugu News » Telangana : రాష్ట్ర రాజకీయ పార్టీలకు వార్నింగ్ ఇచ్చిన CEO వికాస్ రాజ్..!

Telangana : రాష్ట్ర రాజకీయ పార్టీలకు వార్నింగ్ ఇచ్చిన CEO వికాస్ రాజ్..!

లోక్‌సభ ఎన్నికల నోటిఫికేషన్ ఈ నెల 13వ తేదీన విడుదల అవుతుందని తెలిపిన వికాస్ రాజ్.. ఓటు నమోదుకు15వ తేదీ వరకు అవకాశం ఉందన్నారు.. స్వేచ్ఛాయుత, పారదర్శక ఎన్నికల కోసం ప్రజల భాగస్వామ్యం కూడా అవసరం అని భావిస్తున్నట్లు వెల్లడించారు.

by Venu
Sugarcane farmers are the target..Nizamabad Lok Sabha election is the only slogan!

త్వరలో పార్లమెంట్ ఎన్నికలున్న నేపథ్యంలో ప్రధాన పార్టీలు ప్రచారంతో హోరెత్తిస్తున్నాయి.. విమర్శలు ప్రధాన అస్త్రాలుగా మలచుకొని.. ఆరోపణలతో దూసుకువెళ్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి.. ఒక రకంగా పరిమితికి మించి మాట్లాడటం కనిపిస్తుంది. గెలుపే లక్ష్యంగా హమిలిస్తూ.. ఓటును అభ్యర్థిస్తున్నారు నేతలు.. ఈ క్రమంలో తెలంగాణ (Telangana) ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ (Vikas Raj) కీలక వ్యాఖ్యలు చేశారు..

ceo vikas raj meeting at brk bhavan in telangana telangana assembly elections 2023పార్లమెంట్ ఎన్నికలు (Parliament Elections) రాష్ట్రంలో సజావుగా జరిగేలా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశామని తెలిపారు. నేడు ఓ మీడియా ప్రతినిధితో మాట్లాడిన ఆయన.. ప్రజల్ని ఇబ్బంది పెట్టేలా రాజకీయ పార్టీలు ప్రచారం చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అదేవిధంగా అభ్యర్థుల ప్రచార ర్యాలీలకు తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలన్నారు.. ఎలాంటి మతపరమైన విద్వేషాలకు చోటివ్వకుండా వ్యవహరించాలని సూచించారు.

మరోవైపు లోక్‌సభ ఎన్నికల నోటిఫికేషన్ ఈ నెల 13వ తేదీన విడుదల అవుతుందని తెలిపిన వికాస్ రాజ్.. ఓటు నమోదుకు15వ తేదీ వరకు అవకాశం ఉందన్నారు.. స్వేచ్ఛాయుత, పారదర్శక ఎన్నికల కోసం ప్రజల భాగస్వామ్యం కూడా అవసరం అని భావిస్తున్నట్లు వెల్లడించారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలైనప్పటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నిఘా పెంచామని తెలిపిన ఆయన.. ఎలాంటి పత్రాలు, అనుమతులు లేకుండా తరలిస్తున్న వంద కోట్ల సొత్తును ఇప్పటికే స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు..

You may also like

Leave a Comment