Telugu News » Telangana : సెగ పెడుతున్న మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. ఆటోలో అసెంబ్లీకి బీఆర్‌ఎస్‌ నేతలు..!

Telangana : సెగ పెడుతున్న మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. ఆటోలో అసెంబ్లీకి బీఆర్‌ఎస్‌ నేతలు..!

రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలో వచ్చిన తర్వాత ఆటో డ్రైవర్ల జీవితాలు రోడ్డుపై పడ్డాయని, రెండు నెలల్లో 21 మంది ఆటో కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఈ సందర్భంగా హరీశ్‌ రావు పేర్కొన్నారు. ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పించడాన్ని ఆహ్వానిస్తున్నామని, అయితే ఆటో కార్మికులను కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత సర్కారుపై ఉందన్నారు.

by Venu
Harish rao became Fire on the congress party

రేవంత్ (Revanth) సర్కార్ మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కలిపించిన సంగతి తెలిసిందే. అయితే ఈ పథకం వల్ల ఆటోడ్రైవర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పటికే వీరికి మద్దతుగా బీఆర్ఎస్ నేతలు నిలిచారు. అయితే తాజాగా జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో (Assembly meetings) ఈ అంశంపై నిరసన తెలిపేందుకు గులాబీ నేతలు ప్రయత్నిస్తున్నారు.

brs parliamentary party meeting tomorrow topics to be discussed are

ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ (BRS) ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీకి ఆటోల్లో చేరుకొన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హరీశ్‌ రావు (Harish Rao), తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ (Talasani Srinivas Yadav), సుధీర్‌ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, మల్లారెడ్డి, వివేకానంద, మాధవరం కృష్ణారావు, పాడి కౌశిక్‌ రెడ్డి, ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్‌.. మొదలగు వీరంతా.. హైదరాబాద్‌, హైదర్‌గూడ, ఎమ్మెల్యే క్వార్టర్స్‌ నుంచి అసెంబ్లీకి ఆటోల్లో వచ్చారు.

రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలో వచ్చిన తర్వాత ఆటో డ్రైవర్ల జీవితాలు రోడ్డుపై పడ్డాయని, రెండు నెలల్లో 21 మంది ఆటో కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఈ సందర్భంగా హరీశ్‌ రావు పేర్కొన్నారు. ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పించడాన్ని ఆహ్వానిస్తున్నామని, అయితే ఆటో కార్మికులను కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత సర్కారుపై ఉందన్నారు. గిరాకీ లేక 6.5 లక్షల ఆటో కార్మికులు ఈఎంఐలు కట్టలేకపోతున్నారని, ఎంతోమంది ఉపవాసాలు ఉంటూ కుటుంబాలను వెళ్లదీస్తున్నారని అన్నారు.

మరోవైపు మరణించిన ఆటో డ్రైవర్ల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.10 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌ లో ఆటో కార్మికులకు నెలకు రూ.10 వేలు జీవన బృతి కల్పించే విధంగా పొందుపర్చాలని తెలిపారు. ఇదిలా ఉండగా.. సభలోకి ప్రభుత్వం ఆటో డ్రైవర్లను ఆదుకోవాలంటూ ఉన్న ప్లకార్డులను తీసుకెళ్లేందుకు ప్రయత్నించిన బీఆర్ఎస్‌ ఎమ్మెల్యేలను పోలీసులు అడ్డుకొన్నారు. దీంతో పోలీసులకు, ఎమ్మెల్యేలకు మధ్య వాగ్వాదం చోటుచేసుకొన్నదని సమాచారం..

You may also like

Leave a Comment