తెలంగాణ (Telangana) సీఎం కేసీఆర్ (KCR) రాజకీయ ఎత్తుగడలు ఫలిస్తున్నాయని అంతా అనుకొంటున్నారు. చాపకింద నీరులా ఆయన పన్నే వ్యూహాలు చివరికి విజయాన్ని అందిస్తాయని సీఎం అనుచరులు ప్రగాఢంగా నమ్ముతారు. చివరి వరకు ఉత్కంఠంగా సాగిన ఎన్నికల పోరులో ఇప్పటికే రెండు సార్లు విజయం కేసీఆర్ ని ఇలానే వరించిందని గుర్తు చేసుకొంటున్నారు..
ప్రత్యర్ధులకు అందని ఎత్తుగడలతో దూసుకెళ్లుతోన్న బీఆర్ఎస్ లోకి నేతల చేరికలు కూడా ఆగడం లేదు.. అయితే గత కొన్ని రోజుల నుండి కాంగ్రెస్ (Congress) నేత చెరుకు సుధాకర్ (Cheruku Sudhakar) బీఆర్ఎస్‌లోకి వస్తారనే వార్తలు.. జోరుగా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వాటికి నేటితో చెక్ పడింది. చెరుకు సుధాకర్ నేడు బీఆర్ఎస్‌లో చేరారు..
మంత్రులు హరీశ్ రావు, కేటీఆర్ సమక్షంలో శనివారం తెలంగాణ భవన్‌లో గులాబీ తీర్థం పుచ్చుకున్నారు సుధాకర్. ఆయనకు మంత్రులు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మరోవైపు శుక్రవారం బీసీ నేతల విషయంలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డితో పాటు కాంగ్రెస్ నేతల తీరును నిరసిస్తూ డాక్టర్ చెరుకు సుధాకర్ ఆ పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే..