రాజకీయం అనేది శాశ్వతమైన జాబ్ కాదు.. అలాగే ఇక్కడ శత్రువులు, మిత్రులు అంటూ ఎవరు ఉండరు.. అవసరాన్ని, అవకాశాన్ని బట్టి నేతలు మారుతుంటారు.. వారి మనస్సులు మారిపోతాయి. మరోవైపు తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు పది రోజుల సమయం ఉంది. అయిన ఇతర పార్టీల్లోకి జంప్ చేస్తున్నారు కొందరు నేతలు.. ప్రస్తుతం బీజేపీ సీనియర్ నాయకుడు, యాక్టర్ బాబూ మోహన్ కొడుకు ఉదయ్ తండ్రిని కాదని పార్టీ మారారు.
మంత్రి హరీష్ రావు సమక్షంలో ఉదయ్ బీఆర్‌ఎస్ (BRS)లో చేరారు. ఇదిలా ఉండగా.. ఉదయ్ ఇచ్చిన షాక్ కు బీజేపీ (BJP) నేతలు ఫ్రీజ్ అయ్యారు. ఎన్నికల ముందు ఇదేం ట్విస్ట్ అని తలలు పట్టుకుంటున్నారు. మరోవైపు బాబూ మోహన్ (Babu Mohan) బీజేపీలో ఉంటే.. ఆయన కొడుకు బీఆర్‌ఎస్‌లో చేరడంతో రెండు పార్టీల క్యాడర్ కన్‌ఫ్యూజన్‌లో పడిందని వార్తలు వస్తున్నాయి.
ప్రస్తుతం ఉదయ్ (Uday)బాబు నిర్ణయం తెలంగాణ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. దీనికి తోడు ఆందోల్ బీజేపీ కేడర్ మెుత్తం తన వెంటే ఉందని ఉదయ్ చెప్పుకొచ్చాడు. మరోవైపు ఉదయ్ నిర్ణయంతో బీజేపీ పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుక లాగ అయ్యిందని.. ఓట్లన్నీ విచ్ఛిన్నం అయ్యే అవకాశాలు ఉన్నాయని.. బీజేపీ అధిష్టానం ఆలోచనలో పడినట్టు తెలుస్తుంది.
తండ్రికి చేదోడు వాదోడుగా ముందు నుంచి రాజకీయాల్లో ఉంటూ వచ్చిన ఉదయ్. కొంత కాలం నుంచి ఆందోల్ ఎమ్మెల్యే టికెట్ ఆశించారు. తండ్రి ద్వారా హైకమాండ్‌కు రిక్వెస్ట్ కూడా చేయించారు. కానీ బీజేపీ హైకమాండ్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ రాలేదు. ఉదయ్‌ని కాదని బాబు మోహన్‌కే టికెట్ కేటాయించడంతో.. అసతృప్తికి గురైన ఉదయ్.. పార్టీ మారినట్టు తెలుస్తుంది. మొత్తానికి ఆందోల్ (Andol) రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. మరి గెలుపు ఎవరిని వరిస్తుందో చూడాలనుకుంటున్నారు జనం..