ఎన్నికల ప్రచారం మంగళవారం సాయంత్రం 5గంటలకు ముగిసింది. దీంతో అభ్యర్థులు ప్రలోభాల పర్వాన్ని షురూ చేశారు. అభ్యర్థులు విజయమే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నారు. ఇందుకు భారీగా నగదు, మద్యం, బహుమతులను ఎరగా వేసి ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే అదేస్థాయిలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది.
ఎన్నికల వేళ అభ్యర్థులు చేస్తున్న అన్నిరకాల ప్రయత్నాలను అడ్డుకట్టవేసే పనిలో నిమగ్నమయ్యారు. ఈ మేరకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నది. ఇందులో ప్రత్యేక టీమ్‌లను ఏర్పాటు చేసింది. వ్యూహాత్మక ప్రాంతాల్లో చెక్ పోస్టులను ఏర్పాటు చేయడంతో పాటు ఫ్లైయింగ్ స్క్వాడ్‌లు, షాడోషాడో టీమ్‌లను రంగంలోకి దింపాయి.
ఎన్నికల కోడ్అమల్లోకి వచ్చిన అక్టోబర్ 9వ తేదీ నుంచి బుధవారం నాటికి రూ.720 కోట్లకుపైగా సొత్తును సీజ్ చేశారు. ఈ డబ్బు వేర్వేరు రాజకీయ పార్టీలకు చెందిన అభ్యర్థులది కావడం గమనార్హం. సీ విజిల్, ఎన్నికల సంఘం టోల్ ఫ్రీ నెంబర్లకు వస్తున్న సమాచారంతోపాటు తమకు నేరుగా అందుతున్న వివరాల నేపథ్యంలో ఈ ఫ్లెయింగ్ స్క్వాడ్‌లు దాడులు జరుపుతూ తనిఖీలు చేస్తున్నాయి. మరోవైపు ఉన్నతాధికారులు మఫ్టీలో ఉండే షాడో టీమ్‌తో నిఘా పెట్టింది.
ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన అక్టోబర్ 9వ తేదీ నుంచి బుధవారం నాటికి రాష్ట్రవ్యాప్తంగా తనిఖీల్లో రూ.720కోట్లకు పైగా నగదు పట్టుబడింది. రూ.25 కోట్ల విలువ చేసే మద్యం పట్టుబడటం పరిస్థితికి దర్పణం పడుతోంది. ఒక్క మంగళవారం రోజునే రాష్ట్రవ్యాప్తంగా వేర్వేరు చోట్ల రూ.14కోట్లకు పైగా నగదును అధికారులు సీజ్ చేశారు.
రెండున్నర వేలకు పైగా ఎన్నికల్లో డబ్బు, మద్యం, కానుకల పంపిణీని అడ్డుకునేందుకు ఇప్పటికే 1,866 బృందాలు రంగంలో ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా వ్యూహాత్మక ప్రాంతాల్లో 150 చెక్‌పోస్టులను ఏర్పాటు చేశారు. ప్రతీ వాహనాలను తనిఖీ చేస్తున్నారు. అనుమానాస్పద వ్యక్తులను అదుపులోకి తీసుకుంటున్నారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో తనిఖీలను మరింత పటిష్టం చేశారు.