తెలంగాణ (Telangana) అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు బీఆర్ఎస్ (BRS)కి ఊహించని షాకిచ్చారు. రెండుసార్లు అధికారం చేపట్టిన బీఆర్ఎస్ ను కాదని.. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ (Congress) అడిగిన ఒక్క ఛాన్స్ కి జై కొట్టారు. అలాగే గత ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి గెలిచి బీఆర్ఎస్ లో చేరిన ఎమ్మెల్యే లకు ఆయా నియోజకవర్గ ప్రజలు భారీ షాక్ ఇచ్చారు.
తాండూరు నుంచి పైలట్ రోహిత్ రెడ్డి, పినపాక నుంచి రేగా కాంతారావు కూడా ఓటమి చెందారు. ఎన్నికలు జరుగుతున్న సమయంలో రేగా కాంతారావు పై దాడికూడా జరిగింది. కానీ ఆ సింపతీ కూడా పని చేయలేదు. ఇక టీడీపీ నుంచి బీఆర్ఎస్ లోకి మారిన సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, అశ్వారావు పేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు కూడా ఓటమి పాలయ్యారు.
మరోవైపు నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, ఇల్లందు ఎమ్మెల్యే బానోతు హరిప్రియా నాయక్ , పాలేరు ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డి, కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు, కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజుల సురేందర్, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఉన్నారు.. కాగా తాము ఓటు వేస్తే మీరు అలా ఎలా పార్టీ మారి ఓటర్ల నమ్మకాన్ని వమ్ము చేస్తూ స్వార్థంగా ప్రవర్తిస్తున్నారని కావచ్చు ఈ ఎన్నికల్లో ప్రజలు ఆలోచించారని అనుకుంటున్నారు..
ఇలా 2018 అసెంబ్లీ ఎన్నికల్లో (Assembly Elections) కాంగ్రెస్, టీడీపీ (TDP) నుంచి గెలిచి బీఆర్‌ఎస్‌లో చేరిన 9మంది ఎమ్మెల్యేలు ఓటమి మూటగట్టుకున్నారు.. కాగా ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసినట్టుగానే ఎన్నికల ఫలితాలు సరికొత్త ట్రెండ్ సృష్టించాయి.. ఒక్క హైదరాబాద్ నగరంలో మినహా ఎక్కడా పార్టీ ఫిరాయింపులు చేసిన ఎమ్మెల్యేలు గెలుపు రుచి చూడలేదు..