తెలంగాణ (Telangana)లో ఐఏఎస్ (IAS) అధికారుల బదిలీ విషయంలో నెలకొన్న సందిగ్ధత వీడింది.. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం 11 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తోన్నట్టు వెల్లడించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి (Shantikumari) ఉత్తర్వులు జారీ చేశారు. కాగా తెలంగాణలో 11 మంది ఐఏఎస్‌ల బదిలీ (Transfers) వివరాలు చూస్తే..
ఇప్పటి వరకి పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న అర్వింద్ కుమార్ విపత్తు నిర్వహణశాఖకు బదిలీ అయ్యారు.. ఇక విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిగా బుర్రా వెంకటేశం నియమితులయ్యారు. కళాశాల, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌గా అదనపు బాధ్యతలు ఆయనకి అప్పగించారు. మరోవైపు దానకిశోర్ పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శిగా నియమితులయ్యారు. ఆయనకు హెచ్‌ఎండీఏ, సీడీఎంఏ కమిషనర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించారు.
జలమండలి ఎండీగా సుదర్శన్‌రెడ్డి నియమించగా.. వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శిగా క్రిస్టినాకి బాధ్యలు అప్పగించారు. మరోవైపు ఆర్‌అండ్‌బీ శాఖ ముఖ్య కార్యదర్శిగా కె.ఎస్. శ్రీనివాసరాజును నియమించారు.. రాహుల్ బొజ్జాను జీఏడీ కార్యదర్శిగా నియమించారు. అదీగాక ఎస్సీ అభివృద్ధిశాఖ కార్యదర్శిగా అదనపు బాధ్యతలు సైతం అప్పగించారు.
ఇక అటవీ, పర్యావరణశాఖ ముఖ్యకార్యదర్శిగా వాణి ప్రసాద్‌ను నియమించారు. ఈపీటీఆర్‌ఐ డైరెక్టర్ జనరల్‌గా అదనపు బాధ్యతలు కూడా అప్పగించారు. మహిళా శిశుసంక్షేమ శాఖ కార్యదర్శిగా వాకాటి కరుణ నియమితులవ్వగా.. టి.కె.శ్రీదేవి వాణిజ్యపన్నులశాఖ కమిషనర్‌గా నియమించారు.. నల్గొండ కలెక్టర్ ఆర్.వి.కర్ణన్ ని బదిలీ చేసిన ప్రభుత్వం.. వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ డైరెక్టర్‌గా నియమించారు..