తెలంగాణ (Telangana)కాంగ్రెస్ (Congress)లో రాజకీయాలు ఆసక్తికరంగా సాగుతున్నాయి. రెండో జాబితా ప్రకటన తరువాత అనూహ్య అంశాలు తెర మీదకు వస్తున్నాయి. ఇప్పటికే కమ్మ టికెట్ లొల్లి ఆసక్తికరంగా మారగా.. తాజాగా జూబ్లీహిల్స్ (Jubilee Hills)అభ్యర్థిగా మాజీ క్రికెటర్ అజారుద్దీన్ (Azharuddin) ఖైరతాబాద్ అభ్యర్థిగా పీజేఆర్ (PJR)కుమార్తె పి.విజయారెడ్డి (Vijaya Reddy)కి అవకాశం కల్పించడం టీ కాంగ్రెస్ లో రచ్చకు దారి తీసిందని అనుకుంటున్నారు. మరోవైపు సీటు దక్కని ఆశావాహులు పార్టీ వీడేందుకు సిద్దమవుతున్నారని ప్రచారం జరుగుతుంది.
అయితే అధిష్టానం ఖైరతాబాద్ అభ్యర్థిగా పి.విష్ణువర్ధన్‌రెడ్డిని (Vishnu) ప్రకటిస్తారని అంతా భావించారు..కానీ పార్టీ విషయంలో విష్ణు నిర్లక్ష్య ధోరణిని అధిష్ఠానం సీరియస్ గా తీసుకుందని తెలిసింది.. మరోవైపు ఈ నియోజకవర్గంలో మైనార్టీ ఓటర్లను దృష్టిలో పెట్టుకొన్న అధిష్ఠానం అజారుద్దీన్ వైపు మొగ్గు చూపింది. ఆయన పేరు ప్రకటించింది. దీంతో, ఇప్పుడు విష్ణు కాంగ్రెస్ వీడేందుకు సిద్దమయ్యారు. అవసరమైతే స్వతంత్ర అభ్యర్దిగా అయినా బరిలోకి దిగేందుకు సిద్దం అవుతున్నారనే టాక్ వినిపిస్తుంది.
ఈ పరిణామాలతో నియోజకవర్గంలో ఎదురయ్యే సమస్య విషయంలో పార్టీ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. ఇక క్రికెట్ జీవితంలో పలు వివాదాలు ఎదుర్కొన్న అజారుద్దీన్ తెలంగాణ పొలిటికల్ గ్రౌండ్ లో ఏ రకంగా సక్సెస్ అవుతారనేది ఆసక్తికరంగా మారింది. మరోవైపు ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో ఖైరతాబాద్ కు అతి పెద్ద నియోజకవర్గంగా పేరుండేది. 2009లో అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా ఈ నియోజకవర్గం నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలుగా విడిపోయింది.
అయితే ఖైరతాబాద్ నుండి కాంగ్రెస్ అభ్యర్ధి పి.జనార్ధన్ రెడ్డి ఐదు దఫాలుగా విజయం సాధించి కాంగ్రెస్ లో సీనియర్ నేతగా చక్రం తిప్పారు.. అయన మరణానంతరం ఇక్కడి రాజకీయ రూపు రేఖలు పూర్తిగా మారిపోయాయి. ఇకపోతే ఖైరతాబాద్ నుంచి పి.విజయారెడ్డితోపాటు డీసీసీ అధ్యక్షుడు డాక్టర్ సింగిరెడ్డి రోహిణ్‌రెడ్డి కూడా టికెట్ ఆశించారు.. ఈ వ్యవహారంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి కలగజేసుకొని అంబర్‌పేట నుంచి రోహిణ్‌రెడ్డిని పోటీ చేసేలా ఒప్పించారు.
దీంతో విజయారెడ్డికి మార్గం సుగమమం అయింది. ఈ నిర్ణయంతో నియోజకవర్గంలో అసమ్మతికి కూడా చెక్ పెట్టినట్టు అయిందని అనుకుంటున్నారు.. మొత్తానికి కాంగ్రెస్ లో టికెట్ల పంచాయితీ అధికార పార్టీ బీఆర్ఎస్ కి కలిసి వస్తుందని గులాబీ నేతలు ఆశిస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు కాంగ్రెస్ లో జరుగుతున్న పరిణామాలను చూస్తున్న కార్యకర్తలు ఇలాగైతే కాంగ్రెస్ గెలిచినట్టే అని చర్చించుకుంటున్నారు..