Telugu News » నవంబర్ తో రాష్ట్రానికి పట్టిన మకిలీ వదిలిపోతుంది!

నవంబర్ తో రాష్ట్రానికి పట్టిన మకిలీ వదిలిపోతుంది!

ప్యాలెస్ లో ఉండి ప్రజా పాలన పక్కనపెట్టి ప్రజలను దోచుకుంటున్నారని అన్నారు

by Sai
telangana incharge tarun chug comments on brs

10 ఏండ్లుగా కేసీఆర్ ప్రభుత్వం చేస్తున్న అత్యాచారాన్ని, కేసీఆర్ కుటుంబాన్ని పారదోలాలని తెలంగాణ బీజేపీ ఇన్ ఛార్జ్‌ తరుణ్‌ చుగ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. నిరుద్యోగుల సమస్యలపై తాము చేస్తున్న పోరాటంతో అయినా కేసీఆర్ సర్కార్ నిద్ర లేవాలన్నారు. చెవిటి, గుడ్డి ప్రభుత్వం ఇకనైనా మేల్కోవాలని ఆగ్రహం వ్యక్తం చేశారు.

telangana incharge tarun chug comments on brs

ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ ప్రజలకు ఎన్నో హామీలు ఇచ్చారని, ఏది కూడా నెరవేర్చలేదని తీవ్రంగా మండిపడ్డారు. ఈ నవంబర్ తో తెలంగాణకు పట్టిన కేసీఆర్ అనే మకిలి వీడుతుందన్నారు. కేసీఆర్ సర్కార్ ను వైట్ వాష్ చేసి పంపిస్తారని తెలిపారు. నిరుద్యోగులను దగా చేసిన బీఆర్ఎస్ సర్కారుకు వ్యతిరేకంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి 24 గంటల నిరాహార దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే.ఈ దీక్షకు బీజేపీ రాష్ట్ర ఇంచార్జి, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్ సంఘీభావం తెలిపారు

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నువ్వు ఇస్తానని చెప్పిన డబుల్ ఇండ్లు ఏవి? అని ప్రశ్నించారు. కేసీఆర్ ది సిగ్గు, శరం లేని ప్రభుత్వం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ఒక రాజాబాబు అంటూ వ్యంగాస్త్రం వేశారు. తెలంగాణలో కుటుంబ పాలన చేస్తున్నారని మండిపడ్డారు. గతంలో విదేశాల్లో ఉద్యోగం చేసుకునే కేటీఆర్ ఇప్పుడు మంత్రి అయ్యాడు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

దళిత బంధు ఏది కేసీఆర్? ఎందరికి ఇచ్చావు? అని ప్రశ్నల వర్షం కురిపించారు. రైతులను కేసీఆర్ ప్రభుత్వం అత్యాచారం చేస్తోందన్నారు. ప్యాలెస్ లో ఉండి ప్రజా పాలన పక్కనపెట్టి ప్రజలను దోచుకుంటున్నారని అన్నారు. పదవులు కుటుంబ సభ్యులకే ఇచ్చుకున్నారని అన్నారు. తెలంగాణ కోసం పోరాడిన వారికి మీరు ఏం చేశారు? ప్రశ్నించిన బండి సంజయ్ ను జైల్లో పెట్టారంటూ తీవ్రంగా మండిపడ్డారు.

యువత గురించి పోరాడుతున్న ఏకైక పార్టీ బీజేపీ అని తెలిపారు. నిరుద్యోగులకు, యువతకు అండగా మేముంటామని తరుణ్ చుగ్ అన్నారు. 10 ఏండ్లుగా యువతకు అన్యాయం జరిగింది తప్పితే న్యాయం మాత్రం జరగలేదని అన్నారు. దేశంలో ల్యాండ్ మాఫియా జరుగుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ నంబర్ వన్ లో ఉందని ఆరోపించారు. దీని వెనుక కేసీఆర్ హస్తం ఉందన్నారు. కేసీఆర్ సర్కార్.. బై.. బై.. అంటూ తరుణు చుగ్ కీలక వ్యాఖ్యలు చేశారు.

You may also like

Leave a Comment