Telugu News » Telangana : వలసల విషయంలో బీఆర్ఎస్ హైకమాండ్ మౌనం వెనుక కారణం ఇదేనా..?

Telangana : వలసల విషయంలో బీఆర్ఎస్ హైకమాండ్ మౌనం వెనుక కారణం ఇదేనా..?

బీఆర్ఎస్ నేతలు పెద్దగా రియాక్ట్ కాకపోవడంతో అధిష్టానం ఫెయిల్ అయిందా? అనే అభిప్రాయాలు రాజకీయ వర్గాల్లో వ్యక్తం అవుతున్నాయి. ఓ వైపు కాంగ్రెస్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ.. కారులో ఉన్న నేతలను ఖాళీ చేస్తుంటే.. ఈ అంశంపై కేటీఆర్ రియాక్ట్ అయిన తీరు హాట్ టాపిక్ గా మారింది.

by Venu

తెలంగాణ (Telangana)లో అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన వెంటనే పార్లమెంట్ ఎన్నికలు వస్తుండటంతో బీఆర్ఎస్ కు పెద్ద టాస్క్ లా మారిందని తెలుస్తోంది. ఒకవైపు ఓటమి పాలైనప్పటి నుంచి కేసీఆర్ (KCR) ప్రత్యక్షంగా రాజకీయాల్లో చురుకుగా వ్యవహరించక పోవడం.. మరోవైపు పలువురు కీలక నేతలు పక్క పార్టీల వైపు చూడటంతో ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీని రక్షించడం పెద్ద పజిల్ లా మారిందని భావిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది.

brs parliamentary party meeting tomorrow topics to be discussed are

మరోవైపు ప్రధాన పార్టీలైన కాంగ్రెస్ (Congress), బీజేపీ (BJP) పోటాపోటీగా వ్యూహరచన చేస్తుంటే బీఆర్ఎస్ (BRS) మాత్రం తన వాయిస్ ను అధికారంలో ఉన్నప్పుడు వినిపించినంత బలంగా ప్రతిపక్షంగా మారాక వినిపించలేక పోతుందనే అనుమానాలు మొదలైయ్యాయి. అదీగాక గులాబీ పార్టీకి ముందు ముందు భవిష్యత్తు లేదని భావించిన నేతలు మెల్లగా జారుకోవడం ఆందోళన కలిగిస్తుందని అంటున్నారు.

ఇప్పటికే సిట్టింగ్ ఎంపీ వెంకటేశ్ నేత, మాజీ డిప్యూటీ సీఎం రాజయ్య, కేటీఆర్ (KTR) కీలక అనుచరుడిగా పేరున్న హైదరాబాద్ మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసీయుద్దీన్ తో పాటు మరికొంత మంది నేతలు కారు దిగిపోగా.. అదే బాటలో ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డితో పాటు మరికొందరు పార్టీ మారేందుకు సిద్దంగా ఉన్నారనే చర్చ జరుగుతోంది. ఇంత జరుగుతున్నా వలసలను ఆపడంలో గులాబీ అధిష్టానం విఫలం అయిందా ?.. అనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరందుకుంది.

ఈ విషయంలో బీఆర్ఎస్ నేతలు పెద్దగా రియాక్ట్ కాకపోవడంతో అధిష్టానం ఫెయిల్ అయిందా? అనే అభిప్రాయాలు రాజకీయ వర్గాల్లో వ్యక్తం అవుతున్నాయి. ఓ వైపు కాంగ్రెస్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ.. కారులో ఉన్న నేతలను ఖాళీ చేస్తుంటే.. ఈ అంశంపై కేటీఆర్ రియాక్ట్ అయిన తీరు హాట్ టాపిక్ గా మారింది. నిన్న కార్పొరేటర్ల సమావేశంలో మాట్లాడిన కేటీఆర్ పార్టీని వీడి వెళ్లేవారు వెళ్తారని అది వారి ఖర్మ అంటూ కామెంట్ చేయడం పలు అనుమానాలకు చోటు కల్పించినట్లు అయ్యిందంటున్నారు.

తాజాగా వలసల విషయంలో కేటీఆర్ చేస్తున్న వ్యాఖ్యలు సైతం పార్టీకి డ్యామేజి కలిగిస్తాయే తప్పా ప్రయోజనం ఉండదనే టాక్ వినిపిస్తోంది. అయితే ఇదే ఫార్ములా పాటించి రాష్ట్రంలో బీఆర్ఎస్ బలపడింది.. ఇప్పుడు ఈ అంశాన్ని ఫోకస్ చేస్తే అది చివరకు సెల్ఫ్ గోల్ గా మారే ప్రమాదం ఉందని అందుకే వలసల విషయంలో బీఆర్ఎస్ హైకమాండ్ మౌనంగా ఉండటం మేలని భావిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది.

You may also like

Leave a Comment