తెలంగాణ (Telangana) రాష్ట్ర రాజకీయాల్లో కాంగ్రెస్ (Congress), బీఆర్ఎస్ (BRS) మధ్య మాటల వార్ తీవ్ర స్థాయిలో జరుగుతోంది. ఒకవైపు కవిత అరెస్ట్.. మరోవైపు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం గులాబీ గూటిలో పొగబెట్టినట్లుగా మారిందని అనుకొంటున్నారు.. అదేవిధంగా ఈ ట్యాపింగ్ లో బీఆర్ఎస్ పెద్దల హస్తం సైతం ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.. కాగా ఈ అంశంపై మహబూబ్‌నగర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు..
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం బయటకు వచ్చాక కేటీఆర్ (KTR) మేకపోతు గాంభీర్యం ప్రదర్శించడం కనిపిస్తుందని విమర్శించారు.. ఈ కేసులో మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్ జైలుకు వెళ్లాల్సిందే అని శ్రీనివాస్ రెడ్డి జోస్యం చెప్పారు.. నేడు మీడియాతో మాట్లాడుతూ.. ఫోన్ ట్యాపింగ్ కోసం నవీన్ రావు, శ్రవణ్ రావు సర్వేంట్ ఎక్విప్మెంట్ కొనుగోలు చేశారని ఆరోపించారు.. అధికారాన్ని దుర్వినియోగం చేశారని మండిపడ్డారు..
ఇదంతా కేసీఆర్ (KCR) ఆదేశాల మేరకు ఇంటలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావు చేశారని ఆరోపణలు చేశారు.. చేసిందంతా చేసి.. ఇప్పుడు మా ప్రమేయం లేదని అనడం సిగ్గుచేటని మండిపడ్డారు.. ఒకవేళ ఈ తప్పులో మీ ఇన్వ్వాల్ మెంట్ లేకపోతే లై డిటెక్టర్‌కు వస్తారా..? అని ప్రశ్నించారు.. ఇంత జరుగుతున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై కేసీఆర్ ఎందుకు పెదవి విప్పడం లేదని యెన్నం శ్రీనివాస్ రెడ్డి (Yennam Srinivas Reddy) ప్రశ్నించారు.
తెలంగాణ ప్రజలను మోసం చేసి పదేండ్ల పాలన చేశారని ఆరోపించిన ఆయన.. రాష్ట్రంలో ప్రయివేట్ ట్యాపింగ్ యూనివర్సిటీలు ఏర్పాటు చేశారని ధ్వజమెత్తారు.. మరోవైపు శ్రవణ్ రావు, నవీన్ రావు ఫోన్ ట్యాపింగ్‌తో బెదిరింపులకు పాల్పడి వందల కోట్లు దండుకున్నారని విమర్శించారు.. ఈ అంశంపై సిట్ వేసి.. లోతైన దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశా