Telugu News » Telangana : రేవంత్ రెడ్డికి మేలు చేసిన కేసీఆర్.. అందుకే సీఎం అయ్యారా..?

Telangana : రేవంత్ రెడ్డికి మేలు చేసిన కేసీఆర్.. అందుకే సీఎం అయ్యారా..?

బీఆర్ఎస్ పాలన సమయంలో అవినీతిపై దృష్టి కేంద్రీకరించినట్లు టాక్ వినిపిస్తోంది. అయితే ఆవేశపడకుండా అందరూ ఊహించినదానికి భిన్నంగా సీఎం రేవంత్ రెడ్డి కనిపిస్తున్నారని తెలుస్తోంది.

by Venu
revanth-reddy

అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ (BRS) ఓటమి అనంతరం తెలంగాణ (Telangana) రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. త్వరలో లోక్ సభ ఎన్నికలు ఉండటంతో అవి ముదిరి పాకనపడ్డాయి.. అయితే బీఆర్ఎస్ ను ఫామ్ లోకి తేవడానికి గులాబీ బాస్ వ్యూహాలు రచిస్తున్నట్లు ప్రచారం జరుగుతుండగా.. రేవంత్ రెడ్డి (Revanth Reddy) సైతం ప్రత్యర్థుల నోరు మూయించే పనిలో పడ్డట్టు తెలుస్తోంది.

వీటిని కూడా చదవండి: India-Maldives : చైనా మాయలో మాల్దీవులు.. కీలక అంశాలపై కోర్ కమిటీ సమావేశం..!!

brs troll on revanth reddys slippers strong counter of netizens

ఈ క్రమంలో బీఆర్ఎస్ పాలన సమయంలో అవినీతిపై దృష్టి కేంద్రీకరించినట్లు టాక్ వినిపిస్తోంది. అయితే ఆవేశపడకుండా అందరూ ఊహించినదానికి భిన్నంగా సీఎం రేవంత్ రెడ్డి కనిపిస్తున్నారని తెలుస్తోంది. గతంలో ఆయనకు ఎదురైన అనుభవాలతో పదవి దక్కగానే ఆవేశ పడతారని..బీఆర్ఎస్ నేతలపై విరుచుకుపడతారని అనుకున్నారు. కానీ రేవంత్ మౌనం వెనుక సుదీర్ఘమైన ఆలోచన ఉన్నట్టు తెలుస్తోంది.

మరోవైపు రాజకీయాల్లో కక్ష సాధింపులు అనేవి ఎప్పుడూ ఎదుర్కొనే వారికే మేలు చేస్తాయని చరిత్ర చెబుతోంది. జైలుకు వెళ్లిన నేతలు ముఖ్యమంత్రులు అయ్యారు. ఇక తెలంగాణలో కేసీఆర్ కు ప్రత్యామ్నాయంగా రేవంత్ రెడ్డి నిలబడ్డారంటే.. ఆయనను కేసీఆర్ అంతగా టార్గెట్ చేయబట్టే అని తెలుస్తోంది. అందుకే కావచ్చు తాను కేసీఆర్ ను ప్రత్యర్థిగా ఎంచుకోలేదని.. తననే కేసీఆర్ ప్రత్యర్థిగా ఎంచుకున్నారని రేవంత్ రెడ్డి అప్పుడప్పుడు చెబుతూంటారు.

వీటిని కూడా చదవండి: Telangana: బీఆర్ఎస్‌కు బిగ్‌షాక్.. మాజీ ఎమ్మెల్యే రాజీనామా ప్రకటన..!

అదీగాక కేసీఆర్ (KCR), రేవంత్ ను ఏదో చేయాలని టార్గెట్ చేయడంతో అదే ఆయనకు మేలు చేసిందని, ఈ సూక్ష్మసిద్ధాంతం బాగా తెలుసు కాబట్టే రేవంత్ రెడ్డి పదవి చేపట్టగానే ఆవేశపడలేదని, అలా అని వదిలేయలేదని తాజా పరిణామాలను బట్టి అర్థమవుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అందుకే తెలంగాణలో సంచలనం సృష్టిస్తున్న ప్రతి కేసూ బీఆర్ఎస్ దగ్గరకు వెళ్తుందనే వాదన వినిపిస్తోన్నారు.

అయితే ఎవరూ ఊహించని రీతిలో కింది స్థాయి నుంచి ఏం జరిగిందో బయటకు తీసుకు వస్తున్నారని అనుకోంటున్నారు. నిజానికి నేరుగా కేసీఆర్ లేదా కేటీఆర్ ను టార్గెట్ చేస్తే కక్ష సాధింపు అనే ప్రచారం జరుగుతుంది. రాజకీయాల్లో ఇలాంటి కక్ష సాధింపులు వారికి ఉపయోగపడతాయి. సానుభూతి కోసం ప్రయత్నిస్తారు. కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అలాంటి సానుభూతి అస్త్రాన్ని ఇవ్వడానికి సిద్ధం గా లేదని చెబుతున్నారు.

మొత్తం ఏసీబీ ద్వారా స్కాం మూలాల నుంచి తవ్వుకుంటూ వస్తున్నారని దర్యాప్తులో అది కేసీఆర్, కేటీఆర్ వద్దకు చేరుతుందని.. దాని వల్ల ప్రభుత్వం ఎలాంటి కక్ష సాధింపులు పాల్పడటం లేదని ప్రజలకు అంచనాకు వస్తారని నమ్ముతున్నారు. లోక్‌సభ ఎన్నికలు జరిగే వరకూ.. గుట్టు అంతా బయటకు లాగే ప్రయత్నం చేస్తారని.. ఎన్నికలు ముగిసిన తర్వాత అసలు రాజకీయం ప్రారంభిస్తారని అంటున్నారు. మొత్తంగా కేసులు.. వ్యవహారాలు రాబోయే రోజుల్లో తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనాకు వస్తున్నారు..

వీటిని కూడా చదవండి: Maharashtra : బీజేపీ ఎమ్మెల్యే కాల్పులు.. ప్రాణాపాయ స్థితిలో శివసేన నేత..!!

You may also like

Leave a Comment