Telugu News » Telangana : బీఆర్ఎస్‌తో పొత్తుపై క్లారిటీ ఇచ్చిన కిషన్ రెడ్డి.. కేసీఆర్ మౌనం వెనుక వ్యూహం ఇదేనా..?

Telangana : బీఆర్ఎస్‌తో పొత్తుపై క్లారిటీ ఇచ్చిన కిషన్ రెడ్డి.. కేసీఆర్ మౌనం వెనుక వ్యూహం ఇదేనా..?

బీజేపీతో పొత్తుల విషయంలో మల్లారెడ్డి చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తిని రేకెత్తించాయి. అయితే ఈ అంశంపై బీఆర్ఎస్ హైకమాండ్ మాత్రం ఇప్పటి వరకు స్పందించలేదు. పొత్తులపై అసలు మాట్లాడవద్దని నేతలను అతర్గతంగా ఆదేశించినట్లు సమాచారం.

by Venu
union minister kishan reddy serious on campaign about bjp alliance with brs party

బీఆర్ఎస్ బీజేపీ పొత్తులపై.. క్లారిటీ ఇచ్చిన కిషన్ రెడ్డి..

ప్రభుత్వాన్నికూల్చడానికి కేసీఆర్ దగ్గర ఉన్న ప్లాన్ ఏంటీ..

బీజేపీ బీఆర్ఎస్ పొత్తు.. కాంగ్రెస్ కి ఇబ్బందికరమేనా..

పార్లమెంట్ ఎన్నికలు ( Parliament Elections) సమీపిస్తున్న కొద్ది తెలంగాణ (Telangana) రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఎవరికి వారే విజయమే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. ఈ క్రమంలో గత వారం రోజులుగా బీజేపీ (BJP), బీఆర్ఎస్ (BRS) పొత్తులు పెట్టుకుంటాయని రాష్ట్రంలో ప్రచారం జరుగుతోంది. మెజారిటీ స్థానాలపై కన్నేసిన కమలం, కారుతో పొత్తు ఉంటే సాధ్యం అవుతుందనే ప్రచారం జోరందుకోంది.

bjp counter attack on brs leaders comments

అయితే రాష్ట్ర బీజేపీ నేతలు మాత్రం ఈ విషయాన్ని ఎప్పటికప్పుడు ఖండిస్తూ వస్తున్నారు. తాజాగా ఈ ప్రచారంపై కిషన్ రెడ్డి (Kishan Reddy) క్లారిటీ ఇచ్చారు. కేసీఆర్ ను కల్వకుంట్ల కరప్షన్ రావు గా అభివర్ణిస్తూ వీడియో రిలీజ్ చేసిన ఆయన.. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల కంటే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పెద్ద దెబ్బ తినబోతోందని జోస్యం చెప్పారు. ఒక్క సీటు కూడా బీఆర్ఎస్‌కు రాదని షాకింగ్ కామెంట్స్ చేశారు. మునిగిపోయిన నావతో తమకు పొత్తు ఏంటని ప్రశ్నించారు.

మరోవైపు బీజేపీతో పొత్తుల విషయంలో మల్లారెడ్డి చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తిని రేకెత్తించాయి. అయితే ఈ అంశంపై బీఆర్ఎస్ హైకమాండ్ మాత్రం ఇప్పటి వరకు స్పందించలేదు. పొత్తులపై అసలు మాట్లాడవద్దని నేతలను అతర్గతంగా ఆదేశించినట్లు సమాచారం. కానీ రాష్ట్ర రాజకీయాల్లో మాత్రం ఇంకా అనుమానాలు రేకెత్తుతున్నాయి. బీజేపీ, బీఆర్ఎస్ పొత్తులు పెట్టుకుంటే.. కాంగ్రెస్ కి ఇబ్బందికరమనే టాక్ వినిపిస్తోంది.

ఈ క్రమంలో బీఆర్ఎస్ కూడా బీజేపీతో కలిసి మెజార్టీ లోక్ సభ సీట్లు గెల్చుకుని ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలగొట్టొచ్చనే ప్లాన్ లో కేసీఆర్ ఉన్నారంటూ తెరవెనుక ప్రచారం జరుగుతోంది. కానీ తెరముందు జరిగే సీన్ వేరేలా ఉంది. బీఆర్ఎస్ తో పొత్తుల ఆలోచన అసలు చేయడం లేదని బీజేపీ క్లారిటీ ఇవ్వడంతో స్పష్టత వచ్చింది. కానీ కేసీఆర్ మాత్రం తన వ్యూహాలకు పదును పెట్టి ఏదో సంచలనం సృష్టిస్తారని భావిస్తున్నారు.

మరోవైపు పొత్తులు లేవంటూ స్వయంగా కిషన్ రెడ్డి కూడా ఖండించడంతో పాటు కేసీఆర్ పై ఆరోపణలు చేయడంతో.. బీఆర్ఎస్ గట్టిగా రివర్స్ కౌంటర్ ఇస్తుందని అనుకున్నారు. కానీ ఆ పార్టీ నేతలు పెద్దగా స్పందించడానికి ఆసక్తి చూపకపోవడం విడ్డూరమంటున్నారు.. పైగా కేసీఆర్ (KCR) త్వరలో ఢిల్లీ వెళ్లబోతున్నారని బీఆర్ఎస్ వర్గాల నుంచి టాక్ వినిపిస్తోంది.

You may also like

Leave a Comment