నెలరోజులుగా ప్రచారంతో హోరెత్తుతున్న మైకులు నేటి సాయంత్రంతో మూగబోనున్నాయి..నేతల హామీలు విని విని విసుగు వచ్చిన చెవులకు విరామం దొరుకుతుంది. ఇప్పటికే బీఆర్ఎస్ ఓటమి ధ్యేయంగా ప్రచారాలు నిర్వహించిన కాంగ్రెస నేతల్లో గెలుపు ధీమా కనిపిస్తుందని తెలుస్తుంది. వ్యూహాత్మకంగా ప్రచారంలో అడుగులు వేసినట్టు సంబరపడుతున్న కార్యకర్తలు, నేతలు తమ పార్టీ గెలుపుపై దృష్టి పెట్టారంటున్నారు..
ఈ క్రమంలో కాంగ్రెస్ గెలుపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (Revanth Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికల్లో హస్తం విజయం ఖాయమని.. బీఆర్ఎస్ అవినీతి ఆ పార్టీకి ఓటమికి పునాదిగా మారిందని తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ (Congress)కు 80 నుంచి 85 సీట్లు వస్తాయని రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్ (BRS)కు 25 సీట్లు కూడా వచ్చే పరిస్థితి కూడా లేదంటూ రేవంత్ జోస్యం చెప్పారు..
తెలంగాణ (Telangana)లో పార్టీ గెలుపు సమిష్టి విజయంగానే భావిస్తామని తెలిపిన రేవంత్ రెడ్డి.. ఈ విజయంలో పీసీసీ చీఫ్‌గా తనకు కూడా క్రెడిట్ ఉంటుందంటూ అభిప్రాయపడ్డారు. మరోవైపు రైతుబంధుపై కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిశామని.. నవంబర్ 15 లోగా రైతుబంధు ఇవ్వాలని కోరినట్టు వెల్లడించారు.
బీఆర్ఎస్ నేతలు రైతుబంధు ఆపడం వెనుక తమ పాత్ర ఉందని చేస్తున్న దుష్ప్రచారం చేస్తున్నారని రేవంత్ మండిపడ్డారు. ప్రభుత్వ చేతకానితనం వల్ల రైతుబంధు ఆగిందంటూ కామెంట్స్ చేశారు. రైతుబంధు విషయంలో ఈసీకి ఫిర్యాదు చేయాల్సిన అవసరం లేదంటూ ఈ సందర్భంగా పేర్కొన్నారు.