Telugu News » Telangana: భారీగా రేషన్‌కార్డులు రద్దు..? మంత్రి ఉత్తమ్‌కుమార్ క్లారిటీ..!

Telangana: భారీగా రేషన్‌కార్డులు రద్దు..? మంత్రి ఉత్తమ్‌కుమార్ క్లారిటీ..!

రేవంత్ రెడ్డి సర్కార్ పెద్ద ఎత్తున రేషన్ కార్డులు రద్దు చేస్తున్నట్లు ఓ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ క్రమంలో ఈ వార్త నిజమేనా అంటూ ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ ఉత్తమ్ కుమార్‌ను ఎక్స్ (ట్విట్టర్) వేదికగా క్లారిటీ కోరారు. ఈ నేపథ్యంలో  పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ క్లారిటీ ఇచ్చారు.

by Mano
Telangana: Massive cancellation of ration cards..? Clarity of Minister Uttam Kumar..!

తెలంగాణ(Telangana)లో కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Government) ఆరు గ్యారంటీల అమలు కోసం ప్రజల వద్ద నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్న సంగతి తెలిసిందే. ఇలాంటి సమయంలో రేవంత్ రెడ్డి సర్కార్ పెద్ద ఎత్తున రేషన్ కార్డులు రద్దు చేస్తున్నట్లు ఓ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Telangana: Massive cancellation of ration cards..? Clarity of Minister Uttam Kumar..!

ఒక్క మేడ్చల్ జిల్లాలోనే 95,040 రేషన్ కార్డులు రద్దయ్యాయని త్వరలో మిగతా జిల్లాలోనూ ఇదే స్థాయిలో రేషన్ కార్డులు క్యాన్సిల్ చేసే అవకాశం ఉందనే ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతుండటంతో దీనిపై లబ్ధిదారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఈ క్రమంలో ఈ వార్త నిజమేనా అంటూ ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ ఉత్తమ్ కుమార్‌ను ఎక్స్ (ట్విట్టర్) వేదికగా క్లారిటీ కోరారు. ఈ నేపథ్యంలో  పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ క్లారిటీ ఇచ్చారు. రేషన్‌ కార్డుల రద్దు వార్త పూర్తిగా అబద్దం అని కొట్టిపారేశారు. తమ ప్రభుత్వం ఒక్క రేషన్ కార్డునూ తొలగించలేదని మంత్రి స్పష్టం చేశారు.

అయితే, ఈ ప్రచారం చేస్తున్న ట్విట్టర్ ఖాతాపై కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. ఇలాంటి తప్పుడు వార్తలతో ప్రజలను మోసం చేసే వారితో జాగ్రత్తగా ఉండాలని అప్రమత్తం చేసింది. కేటీఆర్‌కు ప్రజల పట్ల బాధ్యత ఉంటే ప్రజలను చైతన్య పరచాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేస్తున్నారు.

You may also like

Leave a Comment