Telugu News » Telangana : తప్పులు జరిగాయి.. దిద్దుకుందామంటున్న కేసీఆర్ ..!?

Telangana : తప్పులు జరిగాయి.. దిద్దుకుందామంటున్న కేసీఆర్ ..!?

ఎన్నికల రిజల్ట్ తర్వాత నుంచి బెడ్ రెస్ట్ లో ఉన్న కేసీఆర్ ప్రస్తుతం ద్వితీయ శ్రేణి నేతలకు టచ్ లోకి వెళ్తున్నట్టు సమాచారం. దాదాపుగా అరవై నియోజకవర్గాల నేతలతో ఇప్పటికే కేసీఆర్ (KCR) మాట్లాడారని పార్టీవర్గాల నుంచి వినిపిస్తోంది.

by Venu

అసెంబ్లీ ఎన్నికల్లో (Assembly Elections) పరాజయం తర్వాత బీఆర్ఎస్ (BRS) లోక్ సభ ఎన్నికలను ఛాలెంజ్ గా తీసుకొన్నట్టు తెలుస్తోంది. ఆషామాషీగా కాకుండా పూర్తి స్థాయిలో విజయం కోసం ప్రయత్నించాలని ఇప్పటికే కార్యకర్తలకు సూచిస్తున్నారు కేటీఆర్ (KTR).. మరోవైపు అభ్యర్థుల విషయంలో కేసీఆర్ ప్రత్యేకంగా కసరత్తు చేస్తున్నట్టు టాక్ వినిపిస్తోంది. ఈ క్రమంలో కింది స్థాయి క్యాడర్ చేయి జారిపోకుండా కాపాడుకునే ప్రయత్నాలు మొదలుపెట్టినట్టు తెలుస్తోంది.

 

ఎన్నికల రిజల్ట్ తర్వాత నుంచి బెడ్ రెస్ట్ లో ఉన్న కేసీఆర్ ప్రస్తుతం ద్వితీయ శ్రేణి నేతలకు టచ్ లోకి వెళ్తున్నట్టు సమాచారం. దాదాపుగా అరవై నియోజకవర్గాల నేతలతో ఇప్పటికే కేసీఆర్ (KCR) మాట్లాడారని పార్టీవర్గాల నుంచి వినిపిస్తోంది. రాష్ట్ర అభివృద్ధిలో పడి పార్టీని క్యాడర్ ను పట్టించుకోలేదని.. తప్పులు జరిగాయని.. దిద్దుకుందామని ఆయన చెబుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.

అయితే పార్టీలో తాము పడిన ఇబ్బందులను కేసీఆర్ దృష్టికి నేతలు తీసుకొస్తున్నట్టు.. అధికార పార్టీలో ఉన్నామన్న పేరే కానీ.. తమను పట్టించుకొన్న వారే లేరని ఎక్కువ మంది చెప్పినట్లుగా తెలుస్తోంది. పార్టీ కోసం కాకుండా సొంత గ్రూపుల్ని మెయింటన్ చేయడం వల్ల.. పార్టీకి.. క్యాడర్ మధ్య బంధం తెగిందని అన్నట్లు టాక్ ఉంది. ఇదే సమయంలో వారిని కేసీఆర్ బుజ్జగిస్తున్నట్టు సమాచారం.

పార్టీకి భవిష్యత్ ఉండదేమోనని భయపడుతున్న క్యాడర్ లో ధైర్యం నింపేందుకు కేసీఆర్ ప్రయత్నం చేస్తున్నారని.. ఫిబ్రవరి నుంచి ఆయన అందరికీ అందుబాటులో ఉండే అవకాశం ఉందని చెబుతున్నారు. మరోవైపు అసెంబ్లీ ఫలితాలు నిరాశకు గురిచేసినా, పార్లమెంటు ఎన్నికల్లో ఓటమిని అధిగమించేలా మెజారిటీ స్థానాలను కైవసం చేసుకోవాలన్న లక్ష్యంగా పావులు కదుపుతోన్న గులాబీ దళానికి.. ప్రస్తుతం అసలైన సవాళ్లు ఎదురవుతున్నాయి. అయినా దిద్దుబాటు చర్యలతో పెద్ద సారు పార్టీని నిలబెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు.. మరి ఏమేరకు ఫలితాలు వస్తాయో చూడాలని అనుకొంటున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తలు మరియు తెలుగు న్యూస్ కోసమై ఇవి చదవండి…!

You may also like

Leave a Comment