దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికలకు (Parliament Elections) కౌంట్ డౌన్ మొదలైంది. రాష్ట్రంతో పాటు ఏపీలో ఒకే సమయంలో ఎలక్షన్లు జరగనున్నాయి.. కొన్ని చోట్ల లోక్‌సభతో పాటు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో పొలిటికల్ హీట్ పెరిగింది. అదేవిధంగా రేపటి నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల కమిషన్ ఇప్పటికే షెడ్యూల్ ప్రకటించింది.
ఇదిలా ఉండగా ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు గెలుస్తారా ?.. లేదా..? అనేది పక్కపెడితే.. నామినేషన్స్ వేయడానికి మంచి రోజుతో పాటు.. ముహూర్తం, సమయం, తిథి వంటి వాటిని సెంటిమెంట్ గా భావించడం కొందరికి ఆనవాయితీగా వస్తుంది. అందులో రాములోరీ కళ్యాణంతో శుభ గడియలు ప్రారంభం అని భావిస్తున్న ఎంపీ బరిలో ఉన్న నేతలు నామినేషన్లకు క్యూ కట్టే అవకాశాలున్నాయి..
ఇకపోతే దేశవ్యాప్తంగా పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలు కలిపి మొత్తం ఏడు దశల్లో జరుగనున్నాయి. తొలి దశ ఎన్నికలు నిర్వహించే ప్రాంతాల్లో 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. కాగా పది రాష్ట్రాల్లో నాలుగో విడతలో పోలింగ్ నిర్వహించనున్నారు. అలాగే రాష్ట్రంతో పాటు ఏపీ (AP)లో మే 13న పోలింగ్ జరుగనుంది. కాగా ఈ ఎన్నికల కోసం తెలంగాణ (Telangana)లో 17 పార్లమెంట్ సెగ్మెంట్ల వారీగా అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం 25 పార్లమెంట్, 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు తెలంగాణలో ఒక్క కాంగ్రెస్ (Congress) మినహా బీఆరెస్, బీజేపీ (BJP) తమ అభ్యర్థులను ప్రకటించాయి. ఏపీలో మాత్రం బీఫామ్ చేతికి వచ్చేంత వరకు కొందరు అభ్యర్థులకు టెన్షన్ తప్పని పరిస్థితి నెలకొంది. ఇక ఎన్నికల షెడ్యూల్ గమనిస్తే..
తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో షెడ్యూల్ ఒకే విధంగా ఉంది. ఏప్రిల్ 18 నామినేషన్ల స్వీకరణ మొదలవుతుంది. అదేవిధంగా ఏప్రిల్ 25న నామినేషన్లకు చివరి రోజు కానుండగా.. 26న నామినేషన్ల పరిశీలన జరగనుంది. 29వ తేదీన ఉపసంహరణకు గడువు ఉండగా.. మే 13న పోలింగ్ నిర్వహించనున్నారు.. అలాగే జూన్ 4 ఎన్నికల ఫలితాలు వెల్లడించనున్నట్లు అధికారులు పేర్కొన్నారు..