బీఆర్ఎస్(BRS), కాంగ్రెస్(Congress) మధ్య లోపాయికారి ఒప్పందం ఉందని బీజేపీ ఎమ్మెల్యేలు(BJP Mla’s) ఆరోపించారు. కృష్ణా జలాల(Krishna waters) విషయంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు తెలంగాణకు అన్యాయం చేశారంటూ ఫైర్ అయ్యారు.
బీఆర్ఎస్ అవినీతిపై సీబీఐ విచారణ కోరిన రేవంత్‌రెడ్డి ఇప్పుడెందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. సీఎం రేవంత్ సీబీఐకి ఉత్తరం రాస్తే కేసీఆర్ అవినీతిపై విచారణ ప్రారంభమవుతుందన్నారు. సీబీఐ విచారణ చేపడితే బీఆర్ఎస్ నేతలు పట్టుబడతారని, కాంగ్రెస్ భయపడుతుంది బీజేపీ ఎమ్మెల్యేలు అన్నారు.
లోక్‌సభ ఎన్నికల కోసమే ఇరు పార్టీలు కేఆర్ఎంబీ పేరుతో నాటకాలు ఆడుతున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో అనేక సమస్యలన్నప్పటికీ కేఆర్ఎంబీ ఎందుకు ప్రస్తావిస్తున్నారని సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు అసెంబ్లీ సమావేశాల ప్రారంభానికి ముందు ప్రశ్నించారు. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న నీటికి అదనపు నీరు వాడుకోవాలని విభజన అంశాల్లో ఉన్నప్పుడు ఎందుకు మాట్లాడలేదన్నారు.
బీఆర్ఎస్, కాంగ్రెస్‌లు ఒక్కటేనని, ఎన్నికల సమయంలోనే ఇరు పార్టీలు తిట్టుకుంటాయని అన్నారు. రహస్య ఒప్పందాలు బయట పడకుండా ఉండేందుకు జాగ్రత్తలు తీసుకుంటున్నారని తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల్లో మోదీ ప్రభంజనం స్పష్టంగా కనిపిస్తుందని సిర్పూర్ ఎమ్మెల్యే అన్నారు. మోడీ వేవ్‌ను సైడ్ ట్రాక్ చేసేందుకే రెండు పార్టీలు చూస్తున్నాయన్నారు. ఇరు పార్టీల తీరును అసెంబ్లీలో ఎండగడతామన్నారు.