రాష్ట్రంలో కొలువుదీరిన రేవంత్ రెడ్డి (Revanth) సర్కార్ వివిధ శాఖల ప్రక్షాళనపై దృష్టి సారించింది. ఇప్పటికే పలు శాఖల అధికారులని బదిలీ చేసిన విషయం తెలిసిందే.. ఇప్పటికే పలవురు ఐఏఎస్, ఐపీఎస్ లకు స్థానచలనం కల్పించిన రేవంత్ సర్కార్.. ఆరోగ్య శాఖపై ఫోకస్ చేసింది. ఇందులో భాగంగా.. తాజాగా డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డాక్టర్ రమేశ్ రెడ్డి స్థానంలో త్రివేణిని నియమించింది.
మరోవైపు బీఆర్ఎస్ (BRS) ప్రభుత్వ హయాం నుంచి కదలకుండా ఉన్న.. డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ గడల శ్రీనివాసరావు (Srinivasa Rao) స్థానంలో, డాక్టర్ రవీంద్ర నాయక్‌ను నియమిస్తున్నట్టు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.. కాంగ్రెస్ (Congress) ప్రభత్యం అధికారంలోకి వచ్చాక గత ప్రభుత్వంలో ఉన్న అన్ని శాఖల అధికారులకి స్థానచలనం కలుగుతోన్న విషయం తెలిసిందే..
ఇదే సమయంలో డీహెచ్గా పని చేసిన గడల శ్రీనివాసరావు గత ప్రభుత్వంతో సన్నిహితంగా మెలిగారనే ఆరోపణలు ఉన్నాయి. అదీగాక కొత్తగూడెం (Kothagudem) అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయబోతున్నాడనే ప్రచారం జరిగింది. మరోవైపు శ్రీనివాసరావు సైతం తన ఆశని గులాబీ బాస్ ముందు ఉంచినట్టు సమాచారం..ఈమేరకు ఎలాగైనా కేసీఆర్ (KCR) తనకు టికెట్ ఇస్తారని శ్రీనివాసరావు చివరి వరకు ఆశలు పెట్టుకున్నట్టు తెలుస్తోంది.
ఈ క్రమంలో శ్రీనివాసరావు పెద్ద ఎత్తున నియోజకవర్గంలో పర్యటనలు చేస్తూ ప్రజలకు చేరువ అయ్యే ప్రయత్నాలు సైతం చేశారు. కానీ గులాబీ అధినేత టికెట్ నిరాకరించడంతో గొంతులో పచ్చివెలక్కాయపడ్డట్టు అయిన శ్రీనివాసరావు సైలెంట్ గా తనపని తాను చేసుకొంటూ ఉన్నాడు.. అయితే గత ప్రవర్తన తాలూకు అనుభవాలు మరచిపోని కొందరు అతడి వైఖరిపై తీవ్ర విమర్శలు వ్యక్తం చేయగా, రేవంత్ రెడ్డి సర్కార్ అతడికి స్థాన చలనం కల్పించిందనే గుసగుసలు వినిపిస్తున్నాయి..