అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిపక్షాలకు రీ సౌండ్ వచ్చేలా విజయాన్ని అందుకొంటామని భావించిన బీఆర్ఎస్ (BRS).. ఓటమి తర్వాత ఏ సౌండ్ లేకుండా అయిపోయింది. దీంతో గత కొద్దికాలంగా పార్టీలో సందిగ్దత నెలకొంది.. నాయకులు, కార్యకర్తలు ఎక్కడికక్కడ స్తబ్దుగా ఉండిపోయారు. పార్టీ పిలుపిచ్చిన కార్యక్రమంలో కేడర్ జోష్‌గా పాల్గొనే పరిస్థితి కూడా లేకుండా పోయింది.
మరోవైపు పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత కార్యకర్తలు, నాయకుల్లో నైరాశ్యం నెలకొన్నట్లు ప్రచారం జరుగుతోంది.. అదీగాక ఒక్కొక్కరిగా పార్టీని వీడుతున్నారు. కారు దిగి హస్తం గూటికి చేరుతున్నారు. దాంతో పార్టీలో ఎవరు ఉంటున్నారో.. ఎవరు కారు దిగి చేయిస్తారో తెలియని పరిస్థితి నెలకొంది. ఇదే సమయంలో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టె ప్రయత్నాలు బీఆర్ఎస్ చేస్తున్నట్లు ఆరోపణలు తీవ్రంగా ప్రచారం జరుగుతున్నాయి.
అయితే కాంగ్రెస్ (Congress) కూడా ప్రతిగా స్పందించడం కనిపిస్తోంది. ఈ క్రమంలో ట్విట్టర్ వేదికగా కాంగ్రెస్, బీఆర్ఎస్ వార్ పీక్స్‌కు చేరింది. ఎప్పటికప్పుడు రెండు పార్టీలు ఒకరిపై ఒకరు కౌంటర్లు వేసుకొంటున్నారు. తాజాగా ఆదివారం టీ కాంగ్రెస్ కేసీఆర్ (KCR) ఫ్యామిలీపై సెటైరికల్ ట్వీట్ చేసింది. కారు చౌక మాటలు మాట్లాడి.. కాస్ట్లిగా దోచిన ఈ కల్వకుంట్ల గ్యాంగ్ కథ ఎలా ఉంటదంటే.. చేసింది ఏమి లేకున్నా.. మంచి పనులు చేస్తే అవి మేము చేసినవే అనుడు..
వాళ్ళ చెడ్డ పనుల్లన్ని మంది నెత్తులకు రుద్దుడు…! మీరు మంచి పనులు చేసుంటే ప్రజలే మిమ్ముల నెత్తిన పెట్టుకుందురు.. ఇలా నెత్తి గొరిగి పంపకుందురు..!! ఇకనైనా గా చౌకబారు మాటలు, చౌకబారు వేషాలు మాని ఒక చక్కని ప్రతిపక్షంగా ఉండనికే ప్రయత్నించండి… లేదంటే ఆ హోదా కూడా గల్లంతై… గల్లికీ పరిమితం కాగల్లరు..!! జర భద్రం…!!’ అని ట్వీట్ చేసింది
ఈ ట్వీట్‌కు కారు పక్కన కేసీఆర్, హరీష్ రావు (Harish Rao), కేటీఆర్ (KTR), సంతోష్ రావుతో పాటు కారుపై కూర్చున్న కవిత (Kavitha) ఫోటోను జత చేసింది. దీనికి కారు చౌక గ్యాంగ్.. దోపిడీ చాలా కాస్ట్లీ గురు..!! అని క్యాప్షన్ పెట్టింది.