Telugu News » Telangana : బీఆర్ఎస్‌కు బిగ్ షాక్ ఇచ్చిన కౌన్సిలర్లు.. 21 మంది రాజీనామా..?

Telangana : బీఆర్ఎస్‌కు బిగ్ షాక్ ఇచ్చిన కౌన్సిలర్లు.. 21 మంది రాజీనామా..?

పార్టీలో ఉన్న నేతలు కొందరు పక్క చూపులు చూస్తోన్నట్టు ఇప్పటికే వార్తలు వ్యాపిస్తున్నాయి.. మరికొందరు రాజకీయ భవిష్యత్తుపై ఆందోళనలో ఉన్నట్టు సమాచారం. ఇదే సమయంలో మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మున్సిపల్ రాజకీయాలు ఒక్కసారిగా హాట్ హాట్ గా మారాయి.. మున్సిపల్ చైర్ పర్సన్ జక్కుల శ్వేత, వైస్ చైర్మన్ బత్తుల సుదర్శన్ పై అవిశ్వాసం ప్రకటించిన బీఆర్ఎస్ కౌన్సిలర్లు.. పార్టీకి రాజీ నామ చేస్తున్నట్లు ప్రకటించడం సంచలనంగా మారింది.

by Venu

అసెంబ్లీ ఎన్నికల్లో (Assembly Elections) బీఆర్ఎస్ (BRS) ఓటమి చెందిన తర్వాత ఎన్నో రాజకీయ పరిణామాలు చోటు చేసుకొంటున్నాయని అనుకొంటున్నారు. కేఆసీఆర్ (KCR) అనారోగ్య కారణంగా పార్టీలో చురుకుగా లేకపోవడం.. కేటీఆర్ (KTR), హరీష్ రావు, కవిత అప్పుడప్పుడు హాల్ చల్ చేస్తోన్న పెద్దగా ప్రయోజనం లేదనే టాక్ వినిపిస్తోంది. అధికారంలో ఉన్నప్పుడు.. ఎప్పుడు విమర్శించే నేతలు సైతం ఇప్పుడు కామ్ గా ఉండటంతో.. గులాబీ లో జోష్ తగ్గిందనే ప్రచారం జరుగుతోంది.

brs focus on parliament elections 2024 brs parliament election plan

ఈ క్రమంలో నేతలు కొందరు పక్క చూపులు చూస్తోన్నట్టు ఇప్పటికే వార్తలు వ్యాపిస్తున్నాయి.. మరికొందరు రాజకీయ భవిష్యత్తుపై ఆందోళనలో ఉన్నట్టు సమాచారం. ఇదే సమయంలో మంచిర్యాల జిల్లా, బెల్లంపల్లి మున్సిపల్ రాజకీయాలు హాట్ హాట్ గా మారాయి.. మున్సిపల్ చైర్ పర్సన్ జక్కుల శ్వేత, వైస్ చైర్మన్ బత్తుల సుదర్శన్ పై అవిశ్వాసం ప్రకటించిన బీఆర్ఎస్ కౌన్సిలర్లు.. పార్టీకి రాజీ నామ చేస్తున్నట్లు ప్రకటించడం సంచలనంగా మారింది.

ఈ నేపథ్యంలో బెల్లంపల్లి (Bellampalli) మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యని అధిష్టానం పట్టించుకోక పోవడంతో ఇక్కడ బీఆర్ఎస్ మనుగడ ఆందోళనగా మారిందంటున్నారు.. ఈమేరకు 21 మంది కౌన్సిలర్లు బీఆర్ఎస్ కు రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. కాంగ్రెస్‌లో చేరిన మున్సిపల్ చైర్ పర్సన్ జక్కుల శ్వేతకు, మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, మున్సిపల్ వైస్ చైర్మన్ బత్తుల సుదర్శన్ మద్దతు ఇవ్వడాన్ని నిరసిస్తూ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు కౌన్సిలర్లు ప్రకటించడం అలజడి రేపింది.

మరోవైపు అవిశ్వాస సమావేశానికి ఒకరోజు ముందే 21 మంది బీఆర్ఎస్ కౌన్సిలర్లు రాజీనామా పత్రాన్ని బీఆర్ఎస్ అధిష్టానానికి పంపించినట్లు తెలిపారు. కాగా విపక్షాలకు తగినంత మద్దతు లేకపోవడంతో మున్సిపల్ చైర్ పర్సన్ జక్కుల శ్వేత, మున్సిపల్ వైస్ చైర్మన్ బత్తుల సుదర్శన్ పై అవిశ్వాసం వీగిపోనుందని సమాచారం.. ఇక త్వరలో పార్లమెంట్ ఎన్నికలున్న నేపథ్యంలో పార్టీలో అంతర్గత కుమ్ములాటలు అధిష్టానానికి తలనొప్పిగా మారుతున్నట్టు తెలుస్తుంది..

You may also like

Leave a Comment