Telugu News » Telangana : అన్నదాతలు అని పిలుచుకొనే మాకు అన్ని కష్టాలే.. పోలీసుల కాళ్లు మొక్కిన మ‌హిళా రైతు..!

Telangana : అన్నదాతలు అని పిలుచుకొనే మాకు అన్ని కష్టాలే.. పోలీసుల కాళ్లు మొక్కిన మ‌హిళా రైతు..!

కొనుగోలు కేంద్రాల్లో వ‌డ్ల‌ను కొనేందుకు ప్ర‌భుత్వం ముందుకు రాకపోవడం వల్ల.. కొనుగోలు కేంద్రాల్లో ఉంచిన ధాన్యం అకాల వ‌ర్షాల‌కు త‌డిసి పాడైపోతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

by Venu

తెలంగాణ‌ (Telangana) అన్న‌దాత‌ల‌ను కాంగ్రెస్ (Congress) స‌ర్కార్ ప‌ట్టించుకోవ‌డం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.. ప్రతిపక్షం బీఆర్ఎస్ సైతం ఇదే వాదన వినిపిస్తోంది. ముఖ్యంగా అకాల వర్షాల కారణంగా కర్షకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. అలాగే పండించిన పంటలకు సరైన ధర రావడం లేదనే మాటలు వినిపిస్తున్నాయి.. రైతులు వారి గోసను చూడాలని ప్రభుత్వానికి విన్నవించుకొంటున్నారు.

కొనుగోలు కేంద్రాల్లో వ‌డ్ల‌ను కొనేందుకు ప్ర‌భుత్వం ముందుకు రాకపోవడం వల్ల.. కొనుగోలు కేంద్రాల్లో ఉంచిన ధాన్యం అకాల వ‌ర్షాల‌కు త‌డిసి పాడైపోతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వ‌డ్ల‌ను కొనుగోలు చేసి రైతుల‌కు మేలు చేయాల‌ని అన్న‌దాత‌లు ప్ర‌భుత్వానికి మొర పెట్టుకుంటున్నారు. మరోవైపు గ‌త 15 రోజులుగా జ‌న‌గామ మార్కెట్‌ను తెర‌వ‌లేదంటూ నిరాశకు గురైన రైతులు వారి తీరుపై మండిపడుతున్నారు..

వ‌డ్ల‌ను కొనుగోలు చేసేందుకు ఎవ‌రూ ముందుకు రావ‌డం లేద‌ని ఆరోపిస్తున్న అన్నదాతలు.. ప్రభుత్వం మారితే బ్రతుకులు మారుతాయని భావించామని.. కానీ అన్నదాతలు అని పిలుచుకొనే మాకు అన్ని కష్టాలే అని ఆవేదన వ్యక్తం చేశారు.. ఈ క్ర‌మంలో రైతుల‌కు (Farmers) ప‌లు సంఘాలు మ‌ద్ద‌తుగా ధ‌ర్నా నిర్వ‌హించాయి. దీంతో జ‌న‌గామ (Janagama) మార్కెట్ వ‌ద్ద‌ ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకొంది.

మరోవైపు విషయం తెలుసుకొన్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొన్నారు. ఈ సంద‌ర్భంగా ఓ మ‌హిళా రైతు వ‌డ్లు కొనాల‌ని కోరుతూ.. పోలీసుల కాళ్లు పట్టుకోవడం చూపరులను కలిచివేసింది. ఇదిలా ఉండగా క్వింటాల్‌కు రూ. 500 బోన‌స్ ఇ

You may also like

Leave a Comment