చెడపకురా చెడేవు అనే సామెత ఊరికే పుట్టలేదనిపిస్తుంది. పుట్ట పెట్టుకొని బుద్దిగా బ్రతుకుతున్న చీమల్ని.. అందులోకెళ్ళి రప్పిస్తే.. ఆ పుట్టను లేకుండా చేస్తే.. ఆ ఫలితం ఎలా ఉంటుందో కొందరికైనా అనుభం అయ్యే ఉంటుంది. బుద్ది అంతా స్వార్థం.. ఆలోచనలన్నీ అరాచకం.. చేతలన్నీ అవినీతి మయం.. వీటికి రాజకీయం తోడైతే.. అధికారం బలంగా మారితే.. మనిషి తోడేలులా మారి ఎన్ని దారుణాలు చేస్తాడో ?.. ప్రస్తుతం రాజకీయాల్లో ఒక అధ్యాయనం ఇలాంటి పేజీని, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం అనే పేరుతో లిఖించుకొందని మేధావులు అభిప్రాయపడుతున్నారు..
రాష్ట్ర ప్రజల కోసం.. వారి ప్రయోజనాల కోసం ఏర్పడిన ప్రత్యేక తెలంగాణ.. బంగారు తెలంగాణగా మారిందని చిలుక పలుకులు పలికిన నేతలు.. వారి విలువలు వారే తీసుకొంటున్నారా? అనే డిఫెన్స్ లో జనాన్ని పడేసినారని అనుకొంటున్నారు.. ప్రస్తుతం తెలంగాణలో (Telangana) నెలకొన్న పరిస్థిని గమనిస్తున్న వారు.. ఎందుకంటే.. అధికారంలో అన్ని అనుకూలంగా ఉండి.. వారుచెప్పేది బూతులైన, నీతుల్లాగా అనిపిస్తాయి..
ప్రస్తుతం బీఆర్ఎస్ ముఖ్య నేతల తీరు ఇందుకు అద్దం పడుతుందని చర్చించుకొంటున్నారు.. అధికారంలో ఉన్నప్పుడు అడ్డగోలు పనులు చేసి.. దాని వల్ల బాధితులైన వారి బాధలు చూసి వికటాట్టహాసాలు చేసి.. ఇప్పుడు అలాంటి వ్యవహారాల వల్ల తానే బాధితులుగా మారి.. తన వల్ల బాధలు పడిన వారినే సపోర్టుగా ఉండాలని కోరడం విచిత్రమే. ప్రస్తుతం కేటీఆర్ (KTR) అదే చేస్తున్నారని అనుకొంటున్నారు.
కవిత (Kavitha) విషయంలో దర్యాప్తు సంస్థల విశ్వసనీయతను ప్రశ్నిస్తూ ఐదేళ్ల కిందట చంద్రబాబు (ChandraBabu) చేసిన ట్వీట్ ను.. రీట్వీట్ చేశారు. రాహుల్ గాందీ అన్న మాటల్ని కూడా కేటీఆర్ తన వాల్ మీదకు తెచ్చుకొన్నారు. ఇవన్నీ గతంలో చేసిన వ్యవహారాల్నే గుర్తుకు తెస్తున్నాయి. అదీగాక పదేళ్ల పాటు తెలంగాణలో సర్వాధికారాల్ని గుప్పిట పట్టుకున్న వారు. పోలీసు వ్యవస్థను ఎలా వాడుకోవాలో అలా వాడుకున్నారనే ఆరోపణలున్నాయి..
అదేవిధంగా రాజకీయ ప్రత్యర్థుల్ని అణిచివేయడానికి ఎంత చేయాలో అంతా చేశారు. చివరికి వ్యవస్థకు మచ్చ తెచ్చేలా ప్రవర్తించారు.. అసలు ఏపీ, తెలంగాణలో డేటాచోరీ పేరుతో రాజకీయం చేయడమేంది.. తెలంగాణ పోలీసు వ్యవస్థను దుర్వినియోగం చేయడం ఏంది ?. ఇది ఉదాహరణ మాత్రమే లెక్కలేనంత దుర్వినియోగం చేసి.. ఎంత మంది జీవితాల్ని నాశనం చేశారో చెప్పాల్సిన పని లేదని చర్చించుకొంటున్నారు.
ఇక బయటకు తెలిసిన దాని కంటే.. కేటీఆర్కు తెలిసిందే ఎక్కువ అనే వాదన వినిపిస్తుంది. అంతే కాకుండా బీఆర్ఎస్ (BRS)లో ఎమ్మెల్యేలు ఎలా చేరారో కూడా ట్యాపింగ్ మహిమలకే తెలియాలని అనుకొంటున్నారు. నడిచినంత కాలం వీరి ఆట నడిచింది. ఇప్పుడు బాధితులుగా మారుతున్నారు. అందుకే నీతులు.. గుర్తుకొస్తున్నాయి. కానీ వాటితో రాజకీయ అవసరాలు తీర్చుకోకుండా ఉన్నట్లయితే.. ఇక్కడ ప్రజలకు కొంత అయినా సానుభూతి ఉండేది.
కానీ ఇప్పుడు ప్రజలకు అదేమీ కనిపించడం లేదని అనుకొంటున్నారు.. దేశంలో గత పదేళ్లుగా వ్యవస్థలన్నీ దిగజారిపోతున్నాయన్నది మాత్రం అందరూ గమనించిన అంశం.. అధికారంలో ఉన్నప్పుడు ఆ వ్యవస్థల్ని చెరబట్టి.. అధికారం పోయాక అవే రక్షించాలంటే సాధ్యం కాదు. ఈ తప్పులో బీఆర్ఎస్ పెద్దలకు.. వారి ఫ్యామిలీకి భాగం ఉందన్నది అంతా ఎరిగిన విషయమే.. ఇంత జరిగాక ఇప్పుడు ఎంత గింజుకున్నా ప్రయోజనం ఉండదన్నది నగ్న సత్యం అంటున్నారు..