Telugu News » Parliament Elections : ఉమ్మడి పాలమూరు జిల్లా బీఆర్ఎస్ లో టెన్షన్..!!

Parliament Elections : ఉమ్మడి పాలమూరు జిల్లా బీఆర్ఎస్ లో టెన్షన్..!!

ఇప్పటికే గెలిచిన జోష్ లో ఉన్న కాంగ్రెస్ (Congress).. పట్టు సాధించాలని తాపత్రయపడుతోన్న బీజేపీ (BJP) పాలమూరు జిల్లాలోని ఎంపీ స్థానాలను ప్రతిష్టాత్మకంగా తీసుకొన్నట్టు తెలుస్తోంది. అయితే ఈ పోరులో బీఆర్ఎస్ వెనకపడితే.. ఇక ముందు రాష్ట్రంలో గుర్తింపు ఉండదనే భయంలో గులాబీ నేతలు ఉన్నట్టు ప్రచారం..

by Venu
brs-public-meeting-in-manakondur

అసెంబ్లీ ఎన్నికల ఓటమితో ఖంగుతిన్న ఉమ్మడి పాలమూరు బీఆర్ఎస్ (BRS) పార్టీ శ్రేణులు పార్లమెంట్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇటీవలే జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గులాబీ పార్టీ 14స్థానాల్లో కేవలం రెండు స్థానాలు మాత్రమే గెలిచింది. అందులో మహబూబ్ నగర్ (Mahabubnagar) పార్లమెంట్ నియోజకవర్గంలో అయితే ఖాతా కూడా ఓపెన్ చేయలేదు..

ఈ నేపథ్యంలో దారుణ ఓటమి నుంచి కోలుకుని పార్లమెంట్ ఎన్నికల్లో (Parliament Elections) సత్తా చాటాలని బీఆర్ఎస్ పార్టీ నేతలు భావిస్తున్నారు. అయితే ఉమ్మడి పాలమూరు జిల్లాలోని రెండు స్థానాలకు ప్రధాన పార్టీల నేతలు బరిలో నిలిచేందుకు రెఢి అయ్యారు. ఇప్పటికే టికెట్ కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారని తెలుస్తోంది. ఈమేరకు బీఆర్ఎస్ లో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకొంది. సిట్టింగ్‌లకే మళ్లీ సీటు ఇస్తారా?.. లేక అభ్యర్థులను మార్చుతారా? అన్న సస్పెన్స్ మొదలైంది.

ఇప్పటికే గెలిచిన జోష్ లో ఉన్న కాంగ్రెస్ (Congress).. పట్టు సాధించాలని తాపత్రయపడుతోన్న బీజేపీ (BJP) పాలమూరు జిల్లాలోని ఎంపీ స్థానాలను ప్రతిష్టాత్మకంగా తీసుకొన్నట్టు తెలుస్తోంది. అయితే ఈ పోరులో బీఆర్ఎస్ వెనకపడితే.. ఇక ముందు రాష్ట్రంలో గుర్తింపు ఉండదనే భయంలో గులాబీ నేతలు ఉన్నట్టు ప్రచారం.. అందుకే పార్లమెంట్ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపీకపై బీఆర్ఎస్ తీవ్ర కసరత్తు చేస్తున్నట్టు టాక్ వినిపిస్తుంది.

ఇక 2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండడం, రెండు పార్లమెంట్ సెగ్మెంట్లలో వారి ఎమ్మెల్యేలే ఉండడంతో విజయం నల్లేరు మీద నడకే అయ్యింది. కానీ ఈసారి పరిస్థితులు ఊహించని తీరులో ఎదురవుతుండటంతో.. ఆచితూచి వ్యవహరించవలసి వస్తుందని భావిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో పార్లమెంట్ ఎన్నికలకు బలమైన అభ్యర్థులను బరిలో దించాలనే యోచనలో అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో సిట్టింగ్‌ సీట్లు ఉంటాయా?.. లేక ఊడుతాయా? అనే చర్చ సాగుతోంది.

You may also like

Leave a Comment