ఏపీలో త్వరలో జరగనున్న ఎన్నికల కోసం వైసీపీ (YCP) రంగం సిద్దం చేసుకొంటుంది. ఇందులో భాగంగా అభ్యర్థుల ఎంపికలో దూకుడు పెంచిందంటున్నారు. మొదటి జాబితా ప్రకటించిన నాలుగు వారాల తర్వాత సెకండ్ లిస్ట్ రిలీజ్ చేసిన జగన్ (Jagan).. ఈ లిస్ట్ లో పదహారు కొత్త ముఖాలకు చోటు కల్పించారు. తెరపైకి కొంతమంది వారసులు వచ్చారు నలుగురు ఎంపీలకు ఎంఎల్ఏ అభ్యర్థులుగా అవకాశం వచ్చింది. 11 మంది సీట్లు గల్లంతు అయ్యాయి. ఇక వారసుల రూపంలో ఆరుగురు సిట్టింగ్‌లకు ఊరట లభించింది.
రాజమండ్రి (Rajahmundry) ఎంపీ మార్గాని భరత్‌ను రాజమండ్రి సిటీకి, కాకినాడ (Kakinada) ఎంపీ వంగా గీతను పిఠాపురంకు, అరకు ఎంపీ గొడ్డేటి మాధవిని అరకు అసెంబ్లీ స్థానానికి, అనంతపురం ఎంపీ తలారి రంగయ్యను కళ్యాణదుర్గం ఇన్‌ఛార్జ్‌లుగా ప్రకటించింది. మరోవైపు ఫస్ట్ లిస్ట్ లో 11మంది సెకండ్ లిస్ట్ లో 27 మందితో కలిపి ఇప్పటివరకు మొత్తం 38 స్థానాల్లో మార్పులు జరిగాయి.. మొత్తం మొత్తంగా 38 మంది ఇంచార్జిలను వైసీపీ ప్రకటించింది.
ఫస్ట్ లిస్ట్ లో కేవలం ఎమ్మెల్యే అభ్యర్థులను మాత్రమే ప్రకటించి సెకండ్ లిస్ట్ లో మాత్రం ఎంపీ టికెట్స్ కూడా అనౌన్స్ చేసింది. అనంతపురం, హిందూపురం, అరకు పార్లమెంట్ స్థానాలకు కొత్త అభ్యర్థులను రంగంలోకి దింపింది, నలుగురు సెట్టింగ్ ఎంపీలకు ఎమ్మెల్యే టిక్కెట్లు కేటాయించింది వైసీపీ. ఇక ఫస్ట్ లిస్టుతో అత్యధికంగా తూర్పు గోదావరి విశాఖ అనంతపురంలో మార్పులు జరిగాయి. మరో రెండు.. మూడు రోజుల్లో మూడో జాబితా కూడా ఉంటుందన్నట్టు సమాచారం.
సెకండ్ లిస్ట్‌లో 11మంది సిట్టింగ్‌లకు షాక్ ఇచ్చారు జగన్. వీళ్లల్లో 10మంది ఎమ్మెల్యేలు కాగా, ఒకరు ఎంపీ ఉన్నారు. మరి, థర్డ్ లిస్ట్‌లో ఎంతమంది సిట్టింగ్‌ల చీటీ చిరగబోతోందో మరో రెండు మూడు రోజుల్లో తేలనున్నట్టు సమాచారం.. మరోవైపు టీడీపీ.. జనసేన.. వైసీపీ ఓటమి లక్ష్యంగా పొత్తు ఏర్పరచుకొన్న విషయం తెలిసిందే.. ఈ క్రమంలో జగన్ తన వ్యూహాలకు పదును పెట్టి ఒంటి చేతితో పార్టీని గెలిపించుకుంటారా?.. లేదా? అనేది ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది..