మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) నేడు కొండగట్టు అంజన్న (Kondagattu Anjanna) ఆలయాన్ని దర్శించుకొని ముడుపు విప్పారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ (BJP) ఎంపీ బండి సంజయ్ (Bandi Sanjay)పై విమర్శలు గుప్పించారు.. కరీంనగర్ పార్లమెంటుకు 10 ఏళ్లలో కేసీఆర్, వినోద్ కుమార్ ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు.
అదేవిధంగా బండి సంజయ్ ప్రజలకు ఏం చేశారో శ్వేతపత్రం విడుదల చేయాలని అన్నారు.. పదవులు అనుభవించినంత కాలం కారులోంచి కాలు కింద పెట్టని వినోద్ కుమార్.. ప్రస్తుతం మార్నింగ్ వాక్ పేరుతో ఓటర్లను ప్రజలను పలకరిస్తూ.. మోసం చేస్తున్నారని మండిపడ్డారు.. కొండగట్టు అంజన్న ఆశీస్సులతో తెలంగాణలో 17 ఎంపీ స్థానాలు గెలుస్తామని మంత్రి ధీమా వ్యక్తం చేశారు..
మరోవైపు కొండగట్టు ఆలయంవద్ద హనుమాన్ విగ్రహం ఏర్పాటు చేస్తానన్న కవిత చేయకపోవడంతో జైలు పాలైందని ఆరోపించిన పొన్నం.. ధాన్యం తరుగు కోసం దీక్ష చేయని బండి సంజయ్ కల్లాల వద్ద దీక్ష చేయడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు.. అలాగే కరీంనగర్ పార్లమెంట్ పరిధి కానీ మాజీ ఎంపీ వినోద్ ఓట్లు ఎలా అడుగుతారని ప్రశ్నించారు.. ఇక కేసీఆర్ (KCR)కు కేవలం గురుబలం మాత్రమే ఉందని కానీ.. మాకు, మా ప్రభుత్వానికి గురుబలంతో పాటు ప్రజాబలం ఉందని పేర్కొన్నారు..