Telugu News » Hyderabad : ఇలాంటి రాజకీయాలు కేసీఆర్ కు వెన్నెతో పెట్టిన విద్య.. హ్య‌పీగా ఫీల్ అవుతున్న క్యాడర్..!

Hyderabad : ఇలాంటి రాజకీయాలు కేసీఆర్ కు వెన్నెతో పెట్టిన విద్య.. హ్య‌పీగా ఫీల్ అవుతున్న క్యాడర్..!

కేసీఆర్ అన‌గానే ఎవ‌రినీ క‌ల‌వ‌డు, ఫాంహౌజ్ కే ప‌రిమితం అవుతారు, త‌ను కల‌వాల‌నుకుంటే త‌ప్పా ఎవ‌రికీ ఫాంహౌజ్ కు అనుమ‌తి ఉండ‌దు అనే టాక్ రాష్ట్రంలో బలపడింది.

by Venu
KCR's silence on Kamalam party is strategic.. Is waiting enough?

మార్పు అనేది ఎంత భయంకరంగా ఉంటుందో బీఆర్ఎస్ అధిష్టానానికి బాగా అనుభవంలోకి వచ్చిందని అనుకొంటున్నారు. పదవిలో ఉన్నన్ని రోజులు ప్రత్యర్థి ఉండకూడదనే వ్యూహాన్ని పక్కాగా అమలు చేసిన కేసీఆర్.. మైకు ముందుకు వస్తే చాలు.. ఏ కూర్చో వయ్యా.. నీకేం తెలుసు.. ఆవులేగాళ్ల.. పాగల్ గాళ్లా.. అనే అచ్చమైన తెలంగాణ యాస పదాలు.. మంట పెట్టేలా మాట్లాడే వారు తప్ప.. ఎదుటి వారు చెప్పింది వినే వారు కాదనే అపవాదు మూటగట్టుకొన్నారు..

KCR in a state of disorientation.. If you think my strength and strength, did you leave me alone?తొమ్మిదిన్న‌ర సంవ‌త్స‌రాల కేసీఆర్ (KCR) పాల‌న‌కు ముగింపు ప‌లికిన మార్పు కావాలి అనే నినాదం కాంగ్రెస్ (Congress)కి చేసిన మేలు అంతా ఇంతా కాదు.. అలా మొదలైన మార్పును నాటి నుంచి నేటి వ‌ర‌కు సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) సందర్భం దొరికినప్పుడల్లా త‌న స్పీచ్ లో మార్పు తెస్తున్నాం మాట‌కు అధిక ప్రాధాన్య‌త ఇస్తూ వ‌స్తున్నట్లు తెలుపుతున్నారు.. ఇక మరక మంచిదే అన్నట్లు.. మార్పు మంచిదే అనేది జనం లేటుగా గుర్తించినట్లు చెప్పుకొంటున్నారు..

ఎందుకంటె ఒక్కరికే సుదీర్ఘకాలంగా అధికారం అప్పచెబితే.. కళ్ళు నెత్తికెక్కుతాయనే నిజాన్ని బీఆర్ఎస్ (BRS)ను చూస్తే అర్థం అవుతుందని అంటున్నారు. మరోవైపు కేసీఆర్ అన‌గానే ఎవ‌రినీ క‌ల‌వ‌డు, ఫాంహౌజ్ కే ప‌రిమితం అవుతారు, త‌ను కల‌వాల‌నుకుంటే త‌ప్పా ఎవ‌రికీ ఫాంహౌజ్ కు అనుమ‌తి ఉండ‌దు అనే టాక్ రాష్ట్రంలో బలపడింది. అయితే అధికారం చేయి దాటిపోయాక కానీ ఆయ‌న‌కు అస‌లు త‌త్వం బోధ‌ప‌డిన‌ట్లు లేదంటున్నారు..

ప్రస్తుతం బీఆర్ఎస్ పరిస్థితి.. మునిగిపోతున్న పడవలా మారిందని చర్చలు మొదలైయ్యాయి. ఇంత జరిగాక కూడా కేసీఆర్ మార‌క‌పోతే బీఆర్ఎస్ మ‌రోసారి అధికారంలోకి రావ‌డం క‌లని సొంత పార్టీ నేతలు కామెంట్ చేసి పరిస్థితి వచ్చింది.. అందుకే అందరికీ టచ్ లోకి వస్తున్నట్లు చెవులు కోరుక్కుంటున్నారు.. ఈ క్రమంలో ఫాంహౌజ్ లో తెగ సమావేశాలు నిర్వహిస్తున్నారు..

గ‌త 15రోజులుగా ద్వితీయ శ్రేణి నేత‌ల‌తో పాటు నాయ‌కుల వెంట వ‌చ్చే కొద్ది మంది క్యాడ‌ర్ ను కూడా కేసీఆర్ క‌లుస్తున్నారు. ఎంతో కొంత స‌మ‌యం వారితో మాట్లాడుతూ, ఫోటోలు దిగుతూ పార్టీని బ్రతికించే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఇక ఈయన తీరు చూసిన సెకండ్ గ్రేడ్ క్యాడ‌ర్ మా సారు మారారని హ్య‌పీగా ఫీల్ అవుతున్నారు. కానీ ఇదంతా పార్ల‌మెంట్ ఎన్నిక‌ల స్టంట్ అని మరికొందరు ఆరోపిస్తున్నారు. ఎందుకంటే ఇలాంటి రాజకీయాలు గులాబీ బాస్ కు వెన్నెతో పెట్టిన విద్య అని గుర్తించలేక పోతున్నట్లు పేర్కొంటున్నారు..

You may also like

Leave a Comment