వ్యూహం సినిమా వ్యూహాత్మకంగా తీసిన నిర్మాతకు వరుసగా ఎదురుదెబ్బలు తగులుతోన్నాయి. ఇప్పటికే కోర్టు తీర్పు నేపథ్యంలో ఈ సినిమా విడుదల వాయిదాల మీద వాయిదాలు పడుతోంది. ఇదివరకే హైకోర్టులో ఇరువైపుల వాదనలు పూర్తి అయిన విషయం తెలిసిందే.. ఈ క్రమంలో నిన్నటికి తీర్పును వాయిదా వేసిన కోర్టు.. ఈ మూవీపై ఈ నెల 22న తీర్పు ప్రకటిస్తామని పేర్కొంది.
ఇంతలో ‘వ్యూహం’ సినిమాకు హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు షాకిచ్చింది. ఈ సినిమాను ఓటీటీ, ఆన్లైన్, ఇంటర్నెట్ వేదికల్లో ఎక్కడ కూడా రిలీజ్ చేయవద్దని ఆదేశించింది. దీంతో ఈ మూవీ విడుదల అవుతుందా ?.. లేదా?.. అనే అనుమానాలు మొదలైనట్టు వార్తలు చక్కర్లు కొడుతోన్నాయి..
పలు విమర్శలు.. వివాదాల మధ్య రాంగోపాల్ వర్మ (Ram Gopal Varma) దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా నిర్మాతకు చుక్కలు చూపిస్తోంది.. ఎందుకంటే ఈ మూవీ లో టీడీపీ అధినేత చంద్రబాబు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh), జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)ను కించ పరిచేలా సన్నివేశాలు ఉన్నాయని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీంతో సినిమా విడుదలను హైకోర్టు నిలిపివేసింది.
మరోవైపు వ్యూహం (Vyooham) సినిమాలో.. దివగంత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి మరణాంతరం ఆంధ్రప్రదేశ్ లో ఏర్పడిన రాజకీయ పరిస్థితుల ఆధారంగా తెరకెక్కించారు రామ్ గోపాల్ వర్మ.. తెరపై వైఎస్ జగన్ ఓదార్పు యాత్ర, ఆయన జైలు జీవితం, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వంట అంశాలు కనిపించండంతో రాజకీయాల్లో చర్చాంశనీయంగా మారింది.. విడుదల వాయిదా పడుతూ వస్తోంది.