రాష్ట్రంలో ఎండలు మండుతున్న వేళ తెలంగాణ ఆర్టీసీ(TSRTC) కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణికుల సంఖ్యను దృష్టిలో ఉంచుకుని మధ్యాహ్నం(AFTERNOON) వేళల్లో బస్సు సర్వీసుల సంఖ్యను తగ్గించాలని(BUS SERVICES COUNT DECREASE) నిర్ణయం తీసుకుంది. రోహిణి కార్తె రాకముందే రాష్ట్రంలో భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ప్రధాన కూడళ్లు మధ్యాహ్నం 12 తర్వాత మైదానాలను తలపిస్తున్నాయి. రోడ్ల మీదకు వచ్చేందుకు జనాలు జంకుతున్నారు.
ఓవైపు మహిళలకు ఉచిత బస్సు సర్వీసును అందిస్తున్న మధ్యాహ్నం లోకల్ బస్సులు ఖాళీగా తిరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే టీఎస్ఆర్టీసీ మధ్యాహ్నం 12 గంటల నుంచి 4 గంటల వరకు ప్రయాణికుల సంఖ్య తక్కువగా ఉన్న ప్రాంతాల్లో సర్వీసుల సంఖ్యను తగ్గించాలని నిర్ణయానికి వచ్చింది.
సాధారణంగా ఆర్టీసీ ఉదయం 5 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు బస్సులను నడుపుతుంటుంది. రాష్ట్రంలో ఎండల తీవ్రత అధికంగా ఉంటుందని మధ్యాహ్నం వేళల్లో బయటకు రావొద్దని ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో మినహా సాధారణ వర్క్స్ ఉంటే సాయంత్రం వేళల్లో ఇంటి నుంచి బయటకు రావాలని పేర్కొంది.
ఈ నేపథ్యంలోనే జనాలు బయటకు రాకపోవడంతో బస్సులు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. ఇదిలాఉండగా, సమ్మర్‌లో ఆర్టీసీ బస్సుల కంటే మెట్రోకు డిమాండ్ విపరీతంగా పెరిగింది. జనాలతో మెట్రీ సర్వీసులు కిటకిటలాడుతున్నాయి.