మన దేశానికి స్పెషల్ అడ్వాంటేజ్ అయిన యువత సామర్థ్యాన్ని దేశం కోసం సద్వినియోగం చేసుకోవాలనేది ప్రధాని మోడీ ఆలోచన అని కేంద్ర మంత్రి, బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి అన్నారు.
ఇవాళ హాకింపేట్ సీఐఎస్‌ఎఫ్, ఎన్‌ఐఎస్‌ఏ, అంతరిక్ష ఆడిటోరియంలో 8 వ రోజ్ గార్ మేళాలో ముఖ్య అతిథిగా పాల్గొని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు పొందిన అభ్యర్థులకు నియామక పత్రాలు కిషన్ రెడ్డి అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..దేశం నేడు శాస్త్ర సాంకేతిక రంగాల్లో అమెరికాతో పాటు గౌరవాన్ని పొందుతున్నాం దానికి ఉదాహరణ చంద్రయాన్ 3 సాధించిన విజయమన్నారు.
అందుకే యువతకు సాధికారత కల్పించడం ద్వారా నాటి వైభవాన్ని పునః ప్రతిష్టించుకునేందుకు మోడీ సంకల్పించారన్నారు. దీనికి తగ్గట్లుగానే 9 ఏళ్లుగా ఒక్కొక్కటిగా వ్యవస్థలో మార్పులు తీసుకొస్తున్నామన్నారు.
వచ్చే 25 ఏళ్ల కాలం అమృత కాలం అని, దేశ చరిత్రలో ఇది అత్యంత కీలకమైన సమయమని, యువత మరింత శ్రమించి పని చేస్తే భారతదేశాన్ని మళ్లీ విశ్వగురుగా పని చేయడం మరింత సులువు అవుతుందని చెప్పారు. అదే సమయంలో ఎన్‌ఈపీ -2020 ద్వారా విద్యావిధానంలో నైతికతకు, సృజనాత్మకతకు పెద్దపీట వేసిందన్నారు.