Telugu News » Delhi : వేడెక్కుతోన్న ఢిల్లీ రాజకీయాలు.. ఇండియా కూటమి మహార్యాలీ..!

Delhi : వేడెక్కుతోన్న ఢిల్లీ రాజకీయాలు.. ఇండియా కూటమి మహార్యాలీ..!

న్యాయ రక్షణ కోసం జరుగుతున్న ర్యాలీలో అందరూ తప్పకుండా పాల్గొనాలని రాయ్ దేశ విజ్ఞప్తి చేశారు. ప్రధాని కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించిన ఆయన కేజ్రీవాల్‌ అరెస్ట్‌ ను దేశ వ్యాప్తంగా రాజ్యాంగాన్ని ప్రేమించే, గౌరవించే వారందరూ వ్యతిరేకిస్తున్నారని తెలిపారు..

by Venu
Delhi Excise Policy Case: Persistence ED .. Kejriwal notices for the seventh time ..!

ప్రస్తుతం ఢిల్లీ రాజకీయాలు హాట్ హాట్ గా ఉన్నాయంటున్నారు.. ఈడీ బోనులో చిక్కిన క్రేజీ వాల్ మద్యం కుంభకోణంలో మెయిన్ పిల్లర్ అనే ఆరోపణలు వస్తున్న క్రమంలో.. ప్రతిపక్షాలు ఈ చర్యలను ఖండిస్తున్నాయి.. అసలే పార్లమెంట్ ఎన్నికలున్నాయి.. ఈ సమయంలో పార్టీ ప్రతిష్టను దిగజార్చాలనే కుట్రతో కేంద్రం క్రేజీ వాల్.. క్రేజీని స్కామ్ పేరుతో నాశనం చేయాలని చూస్తుందని ప్రతిపక్ష పార్టీలు మండిపడుతున్నాయి..

Problems in INDIA Alliance Meetingఈ నేపథ్యంలో ప్రతిపక్షాల ఐక్యత, బలాన్ని ప్రదర్శించే లక్ష్యంతో ఇండియా కూటమి (INDIA Alliance) మార్చి 31న ఢిల్లీ (Delhi) లోని రాంలీలా మైదాన్‌లో మహా ర్యాలీ నిర్వహించాలని నిర్ణయించినట్లు మంత్రి గోపాల్ రాయ్ (Gopal Roy) నేడు ప్రకటించారు.. లిక్కర్ స్కాం (Liquor Scam)లో సీఎం అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwall) అరెస్టు నేపథ్యంలో.. బీజేపీ (BJP) నియంతృత్వ ధోరణికి వ్యతిరేకంగా ఈ ర్యాలీ జరుపుతున్నట్లు వెల్లడించారు..

న్యాయ రక్షణ కోసం జరుగుతున్న ర్యాలీలో అందరూ తప్పకుండా పాల్గొనాలని రాయ్ దేశ విజ్ఞప్తి చేశారు. ప్రధాని కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించిన ఆయన కేజ్రీవాల్‌ అరెస్ట్‌ ను దేశ వ్యాప్తంగా రాజ్యాంగాన్ని ప్రేమించే, గౌరవించే వారందరూ వ్యతిరేకిస్తున్నారని తెలిపారు.. రాజకీయ నాయకులను భయపెట్టేందుకు, ప్రతిపక్షాలను నిర్మూలించేందుకు మోడీ (Modi).. దర్యాప్తు సంస్థలను ఉపయోగించుకుంటున్నారని తీవ్రంగా విమర్శలు గుప్పించారు.

ఇండియా కూటమి మిత్రపక్షాల నేతలు మార్చి 31న ఏకతాటిపైకి వస్తారని సీపీఎం నేత రాజీవ్ కున్వార్ తెలిపారు. ప్రజాస్వామ్యంపై దాడులను తాము సహించబోమని అన్నారు.. అదేవిధంగా ఢిల్లీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్ లవ్లీ సైతం బీజేపీపై మండిపడ్డారు. రాహుల్‌ గాంధీ ప్రజాస్వామ్యాన్ని రక్షించేందుకు యుద్ధం చేస్తున్నారని అన్నారు.. ఈ విషయంలో కాంగ్రెస్ వెనక్కి తగ్గదని స్పష్టం చేశారు.

You may also like

Leave a Comment