Telugu News » Ponguleti : రాష్ట్ర ఖజానా ఖాళీ.. హెచ్చరించిన కాంగ్రెస్ మంత్రి..!!

Ponguleti : రాష్ట్ర ఖజానా ఖాళీ.. హెచ్చరించిన కాంగ్రెస్ మంత్రి..!!

బీఆర్ఎస్ పై మండిపడ్డ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వారిలాగా మాయమాటలు చెప్పడం మాకు సాధ్యం కాదన్నారు. మేము అలా చేయమని, ఆరు గ్యారెంటీలను సామాన్య ప్రజలకు తప్పక అందిస్తామని తెలిపారు.

by Venu
Ponguleti

తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ప్రస్తుతం పైన పటారం లోన లొటారంలా మారిందనే ఆరోపణలు వస్తోన్న క్రమంలో.. రాష్ట్రాన్ని కాంగ్రెస్ (Congress) ప్రభుత్వం ఎలా ముందుకి తీసుకెళ్తుందనే అనుమానాలు కలుగుతోన్నాయి. అభివృద్ధి జరిగిందని చెప్పుకొంటున్న గత పాలకులు.. ఇంతలా అప్పులు ఎలా పెరిగాయి? బీఆర్ఎస్ నేతల ఆస్తులు అంతలా ఎలా పెరిగాయి? అనే ప్రశ్నలకి సమాధానం ఇవ్వడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతోన్నాయి.

Ponguleti

అయితే రేవంత్ రెడ్డి ప్రభుత్వం వెనక్కి తగ్గేది లేదంటుంది. ఇప్పటికే అవినీతిపై చర్యలకి అడుగు వేస్తూనే.. మరోవైపు ఆరు గ్యారంటీలు అమలుపై కసరత్తు ప్రారంభించిందని తెలుస్తోంది. ఈ క్రమంలో రెవెన్యూ, ఐ అండ్ పీఆర్, గృహ నిర్మాణశాఖా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivas Reddy).. వివిధ అంశాలపై పలు కీలక వ్యాఖ్యలు చేశారు..

రాష్ట్ర ఖజానాను ఖాళీ చేసి బీఆర్ఎస్ (BRS) ప్రభుత్వం మాకు ఇచ్చిందని తెలిపిన పొంగులేటి.. ప్రభుత్వం చేసిన తప్పులు ఏమిటి అనే దానిపై సమీక్ష జరుపలేదన్నారు. సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy)కి.. అధికారుల మీద రాజకీయ పార్టీల మీద ఏనాడూ కక్ష్య సాధింపు లేదన్నారు. ఆక్రమణకు గురైన ప్రభుత్వ భూముల విషయంలో మాత్రం ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని వెల్లడించారు. ప్రభుత్వం సొమ్మును దోచుకున్న ఎవ్వరినీ క్షమించం అంటూ క్లారిటీ ఇచ్చిన పొంగులేటి.. ఎంత పెద్ద నాయకుడు అయిన వదిలిపెట్టం అని స్పష్టత ఇచ్చారు.

మరోవైపు బీఆర్ఎస్ పై మండిపడ్డ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వారిలాగా మాయమాటలు చెప్పడం మాకు సాధ్యం కాదన్నారు. మేము అలా చేయమని, ఆరు గ్యారెంటీలను సామాన్య ప్రజలకు తప్పక అందిస్తామని తెలిపారు. జర్నలిస్టులకు ఇచ్చిన హామీలను సామాన్యులకు ఇచ్చే ఇళ్లను విడతల వారీగా ఇస్తామన్నారు. తెలంగాణలో ఇల్లు లేదు అనే మాట రాకుండా చూస్తామని పొంగులేటి తెలిపారు. ప్రతిపక్షాలు సహకరించక పోయిన పర్వాలేదు కానీ కారు కూతలు కూయకండని ఆయన హెచ్చరించారు..

You may also like

Leave a Comment