Telugu News » Thirumala : టీటీడీ పాలకమండలి పై మండిపడ్డ బీజేపీ నాయకులు..!!

Thirumala : టీటీడీ పాలకమండలి పై మండిపడ్డ బీజేపీ నాయకులు..!!

స్మార్ట్ సిటీ కోసం వేల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందని బీజేపీ నేతలు గుర్తు చేశారు. స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నిధులు తీసుకురావాలని, తమ స్వప్రయోజనాల కోసం టీటీడీ నిధులను ఖర్చు చేస్తే శ్రీవారి భక్తులతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు.

by Venu

తిరుమల (Thirumala) తిరుపతి (Thirupathi) దేవస్థానం నిధులను వృధా చేస్తున్నారని పాలకమండలి పై మండిపడ్డారు భాజపా (BJP) నాయకులు. శ్రీవారిని దర్శించుకోవడానికి దేశం నలుమూలల నుండి వచ్చే వేలాది మంది భక్తులు స్వామివారికి ముడుపులు.. కానుకల రూపంలో నగదు చెల్లించుకుంటారని.. అలా వచ్చే నిధులను టీటీడీ చైర్మన్ (Chairman), స్థానిక ఎమ్మెల్యే (MLA) భూమన కరుణాకర్ రెడ్డి (Bhumana Karunakar Reddy).. తిరుపతి పట్టణాభివృద్ధి పేరిట ఖర్చు చేస్తున్నారని కమలం నేతలు ఆరోపించారు.

ఈ సందర్భంగా భాజపా నాయకులు అలిపిరి గరుడ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేశారు. శ్రీవారిపై నమ్మకం లేని కమ్యూనిస్టులు బీజేపీని విమర్శించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. తిరుపతి అభివృద్ధికి బీజేపీ అడ్డు కాదని, స్మార్ట్ సిటీ కోసం వేల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందని బీజేపీ నేతలు గుర్తు చేశారు. స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నిధులు తీసుకురావాలని, తమ స్వప్రయోజనాల కోసం టీటీడీ నిధులను ఖర్చు చేస్తే శ్రీవారి భక్తులతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు.

ఏపీ ముఖ్యమంత్రిగా జగన్ ప్రమాణం స్వీకారం చేసినప్పటి నుంచి హిందూ దేవాలయాలపై దాడులు జరుగుతున్నాయని బీజేపీ నేతలు ఆరోపణలు చేశారు. శ్రీవారి నిధులపై కన్ను వేసిన రాష్ట్ర ప్రభుత్వం, తన నిర్ణయాన్ని వెంటనే విరమించుకోని, టీటీడీ ధర్మకర్తల మండలిని రద్దు చేయాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు.

You may also like

Leave a Comment