తెలంగాణ (Telangana)లో నేతల మధ్య విమర్శలు ఇంకా ఆగిపోవడం లేదు. ఎన్నికలకు ఎక్కువగా సమయం లేకపోవడంతో ప్రచారంలో కానీ.. విమర్శలలో కానీ నేతలు దూకుడు పెంచారు. ఇప్పటికే బీఆర్ఎస్ (BRS)పై కాంగ్రెస్ అవినీతి ఆరోపణలు చేస్తుండగా.. రాష్ట్రం నాశనం కావడానికి కారణం కాంగ్రెస్ (Congress) అని బీఆర్ఎస్ విరుచుకుపడుతుంది. ఇలా విమర్శకు.. విమర్శనే సమాధానంగా నేతల ప్రచారాలు సాగుతున్నాయి.

తెలంగాణలో బీఆర్ఎస్ అధికారం చేపట్టిన తర్వాత కూడా ఇక్కడి పరిస్థితులలో మార్పు ఏది కలుగలేదని రాజగోపాల్ రెడ్డి ఆరోపించారు. ప్రభుత్వ బడులు, దవాఖానాలో మౌలిక సదుపాయాలు లేవని చెప్పారు. నామమాత్రంగా కొన్ని చోట్ల అభివృద్ధి అనే రంగులద్ది పది సంవత్సరాల నుంచి కాలయాపన చేస్తున్నారని రాజగోపాల్ రెడ్డి ఆరోపించారు.
తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అభివృద్ధి చేస్తామని తెలిపిన రాజగోపాల్ రెడ్డి.. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీ పథకాలు పేద ప్రజల కోసమే ప్రవేశపపెట్టబోతుందని చెప్పారు. పేదలు, మైనార్టీ, బడుగు బలహీన వర్గాల కోసం ఆలోచించే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని తెలిపారు.. మరోవైపు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే బీఆర్ఎస్ మూడు ముక్కలవుతుందని బాంబు పేల్చారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి..