Telugu News » Tik Tok Ban: అమెరికాలో టిక్‌టాక్‌ నిషేధ బిల్లుకు ఆమోదం..!

Tik Tok Ban: అమెరికాలో టిక్‌టాక్‌ నిషేధ బిల్లుకు ఆమోదం..!

చైనా(China) యాప్ టిక్-టాక్‌(TikTok)ను అగ్రరాజ్యం అమెరికా నిషేధించింది. ఈ మేరకు టిక్‌టాక్‌ నిషేధానికి సంబంధించిన బిల్లుకు అమెరికా ప్రతినిధుల సభ బుధవారం ఆమోదం తెలిపింది.

by Mano
Tik Tok Ban: Tik Tok ban bill approved in America..!

చైనా(China) యాప్ టిక్-టాక్‌(TikTok)ను అగ్రరాజ్యం అమెరికా నిషేధించింది. ఈ మేరకు టిక్‌టాక్‌ నిషేధానికి సంబంధించిన బిల్లుకు అమెరికా ప్రతినిధుల సభ బుధవారం ఆమోదం తెలిపింది. ఈ నిషేధ బిల్లుకు 352 మంది అనుకూలంగా ఓటు వేయగా.. 65 మంది వ్యతిరేకించారు. అధికార డెమోక్రాటిక్‌ పార్టీ సభ్యులతోపాటు విపక్ష రిపబ్లికన్లు కూడా ఈ బిల్లుకు మద్దతు తెలిపారు.

Tik Tok Ban: Tik Tok ban bill approved in America..!

ప్రతినిధుల సభలో ఆమోదం పొందిన ఈ బిల్లును సెనేట్‌లో ప్రవేశపెట్టారు. సెనేట్‌లో ఆమోదం పొందిన ఈ బిల్లుపై అధ్యక్షుడు జో బైడెన్‌ సంతకం చేయాల్సి ఉంటుంది. బైడెన్‌ సంతకం తర్వాత ఈ బిల్లు చట్టం కానుంది. కాగా, ‘విదేశీ నియంత్రిత యాప్‌ల నుంచి అమెరికన్లకు రక్షణ’ పేరిట తీసుకొచ్చిన ఈ బిల్లును భారత సంతతికి చెందిన డెమోక్రాటిక్‌ సభ్యుడు రాజా కృష్ణమూర్తి, రిపబ్లికన్‌ పార్టీకి చెందిన ప్రతినిధి మైక్‌ గల్లాఘే కలిసి రూపొందించారు.

ఈ బిల్లు టిక్‌టాక్‌ నిషేధానికి సంబంధించింది కాదని డెమోక్రాటిక్‌ సభ్యుడు కృష్ణమూర్తి తెలిపారు. దాన్ని నియంత్రిస్తున్న బైట్‌డ్యాన్స్‌ గురించి అని చెప్పారు. టిక్‌టాక్‌ యాజమాన్యం పూర్తిగా దాని ఆధీనంలోనే ఉందన్న ఆయన.. ఆ కంపెనీ చైనా కమ్యూనిస్ట్ పార్టీ అధీనంలో పనిచేస్తోందని వెల్లడించారు. బైట్‌ డాన్స్ ఎడిటర్-ఇన్-చీఫ్ సీసీపీలో అత్యున్నత హోదాలో ఉన్నారంటే పరోక్షంగా టిక్‌టాక్‌ను సీసీపీ నియంత్రిస్తోందని కృష్ణమూర్తి పేర్కొన్నారు.

మరోవైపు సీపీపీ నియంత్రణలోని టిక్‌టాక్‌ అమెరికాలో కార్యకలాపాలు కొనసాగించడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని మాజీ ఉపాధ్యక్షుడు, రిపబ్లికన్‌ పార్టీ ప్రతినిధి మైక్‌ పెన్స్‌ అన్నారు. భారత్‌లోనూ నిషేధించిన విషయం తెలిసిందే. 2020లో చైనాతో సంబంధాలు క్షీణించిన తర్వాత భారత ప్రభుత్వం ఆ నిర్ణయం తీసుకుంది. అయితే, ఇప్పుడు అమెరికా టిక్‌టాక్‌ను నిషేధిస్తూ బిల్లుకు ఆమోదం తెలిపింది.

You may also like

Leave a Comment