Telugu News » Tirumala: శ్రీవారి భక్తులకు అలర్ట్.. ‘ఎస్ఎంఎస్ పే సిస్టమ్’ సేవలు..!

Tirumala: శ్రీవారి భక్తులకు అలర్ట్.. ‘ఎస్ఎంఎస్ పే సిస్టమ్’ సేవలు..!

తిరుమల శ్రీవారి దర్శనం కోసం విచక్షణ కోటాలో కేటాయించిన బ్రేక్ దర్శనం టిక్కెట్లను పొందుతున్న భక్తుల సౌకర్యార్థం టీటీడీ ఇటీవల ఎస్ఎంఎస్(SMS) చెల్లింపు విధానాన్ని ప్రవేశపెట్టింది.

by Mano
Tirumala: Alert for Srivari devotees.. 'SMS Pay System' services..!

టీటీడీ(TTD) కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమల శ్రీవారి దర్శనం కోసం విచక్షణ కోటాలో కేటాయించిన బ్రేక్ దర్శనం టిక్కెట్లను పొందుతున్న భక్తుల సౌకర్యార్థం టీటీడీ ఇటీవల ఎస్ఎంఎస్(SMS) చెల్లింపు విధానాన్ని ప్రవేశపెట్టింది.

Tirumala: Alert for Srivari devotees.. 'SMS Pay System' services..!

ఫిబ్రవరి 1 నుంచి ఈ విధానం అమల్లోకి రానుంది. ఈ మేరకు తిరుమల తిరుపతి దేవస్థానం ఓ ప్రకటన విడుదల చేసింది. కొత్త విధానంలో, చెల్లింపు లింక్ ఎస్ఎంఎస్ ద్వారా  ద్వారా సెల్ ఫోన్ లకు పంపనున్నారు. భక్తులు ఆ లింక్‌పై క్లిక్ చేసి యూపీఐ లేదా క్రెడిట్ కార్డ్ లేదా డెబిట్ కార్డ్ ద్వారా ఆన్‌లైన్‌లో చెల్లించవచ్చు.

ఎంబీసీ-34 కౌంటర్‌కు వెళ్లకుండా బ్రేక్ దర్శన్ టిక్కెట్ల ప్రింటవుట్ తీసుకోవచ్చు. ఇప్పటికే సీఆర్‌వోలో లక్కీడిప్ ఆఫ్‌లైన్‌ ద్వారా సేవాటికెట్లను పొందుతున్న భక్తుల కోసం ఈ విధానం అమలుకానుంది.  మరోవైపు, సూర్య జయంతి సందర్భంగా ఫిబ్రవరి 16న తిరుమలలో రథ సప్తమి వేడుకలు నిర్వహించనున్నారు.

ఈ సందర్భంగా స్వామివారు ఏడు వాహనాలపై ఆలయ మాడవీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిస్తున్నారు. మాఘ మాసంలో వచ్చే శుక్ల పక్ష సప్తమి తిథిని రథ సప్తమి లేదా మాఘ సప్తమి అంటారు. ఆదివారం ఆలయంలో నిర్వహించే కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవలను రద్దు చేసింది. కాగా సుప్రబాతం, తోమాల, అర్చన ఏకాంతంగా నిర్వహిస్తారు.

You may also like

Leave a Comment