తిరుమల(Tirumala) శ్రీవారి భక్తులకు టీటీడీ(TTD) బిగ్ అలర్ట్ జారీ చేసింది. దీపావళి(Diwali) రోజు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. తిరుమల శ్రీవారి ఆలయంలో ఈనెల 12న దీపావళి ఆస్థానాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేసినట్లు టీటీడీ పేర్కొంది. ప్రోటోకాల్ దర్శనం మినహా మిగిలిన బ్రేక్ దర్శనాలు రద్దు చేశామని తెలిపింది.
అదేవిధంగా 11న బ్రేక్ దర్శనానికి సిఫార్సు లేఖలు కూడా స్వీకరించబోమని టీటీడీ వెల్లడించింది. దీపావళి పండగ రోజున ఉదయం 7 నుంచి 9 గంటల వరకు బంగారు వాకిలి ముందున్న గంటా మండపంలో ఆస్థానం జరగనుంది. ఇదిలా ఉండగా, శుక్రవారం ఉదయం 10 గంటలకు తిరుమల శ్రీవారి టికెట్లు విడుదల కానున్నాయి. డిసెంబర్ 23 నుంచి జనవరి 1వ తేది వరకు తిరుమల వైకుంఠ ద్వార దర్శనం జరుగనుంది.
ఈ తరుణంలోనే.. ఇవాళ ఆన్లైన్లో వైకుంఠద్వార దర్శన టికెట్లను విడుదల చేయనుంది టీటీడీ. మరోవైపు, తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. 13 కంపార్టుమెంట్లలో భక్తులు వేచివున్నారు. దీంతో టోకెన్ లేని భక్తులకు తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతోంది.
గురువారం ఒక్కరోజే తిరుమల శ్రీవారిని 56,723 మంది భక్తులు దర్శించుకున్నారు. 21,778 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం నిన్న ఒక్క రోజే రూ.3.37 కోట్లుగా నమోదైంది. తిరుమల శ్రీవారి ఆలయంలో ఈనెల 12న నిర్వహించే దీపావళి ఆస్థానాన్ని శాస్త్రోక్తం కార్యక్రమానికి భక్తులు పెద్దసంఖ్యలో తిరుమలకు చేరుకునే అవకాశాలున్నాయి.