తిరుమల (Thirumala)లో శ్రీవారి బ్రహ్మెత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం రోజున సాయంత్రం శ్రీవారిని (Srivarini) గజవాహనం ( Gajavahanam)పై ఊరేగిస్తున్నారు. తిరుమల మాడ వీధుల్లో విహరించిన స్వామివారు భక్తులను కటాక్షించారు. కలియుగ దైవంగా భావించే శ్రీవారిని.. భక్తులు గజవాహనంలో తిలకించి.. భక్తితో పరవశించిపోతున్నారు.
మరోవైపు పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు స్వామి వారి వాహన సేవను దర్శించుకొని ఆశీర్వాదాలు పొందారు. అహకారం తొలగితే భక్తుడికి భగవంతుడు రక్షకుడిగా ఉంటాడనే విషయాన్ని గజవాహన సేవ గుర్తు చేస్తుందని వేదపండితులు చెబుతున్నారు. ఇందులో ఉన్న పరమార్ధాన్ని వివరించారు..
గజేంద్రుడు సంసార కారాగారంలో ప్రవేశించి.. మోహవశమై.. బయటకు రాలేక.. పోరాడి విఫలమవుతాడు. చివరికి ఆ వైకుంఠనాథుడి శరణు వేడుతాడు. స్వామి వైకుంఠం నుంచి వచ్చి మొసలిని ఖండించి.. గజేంద్రుడిని రక్షిస్తాడు. శరణాగతి ప్రక్రియలో గజేంద్రుడి ప్రాధాన్యం అనన్య సామాన్యం. గజరాజుని అధిష్ఠించిన శ్రీహరిని దర్శిస్తే.. ఈ గజేంద్ర మోక్షం (Gajendra Moksham) మదిలో మెదులుతుంది.
‘సర్వ ధర్మాన్ పరిత్యజ్య మా ఏకం శరణం వ్రజ’.. అని గీతాచార్యుడి చరమ సందేశం. గజేంద్రుడు శ్రీహరిని భక్తితో వేడుకొన్నట్టు.. భక్తులు కూడా సదా శ్రీనివాసుడి హృదయ పీఠికపై దృష్టి నిలిపి శరణాగతి చెందాలన్న దివ్య సందేశాన్ని గజవాహన సేవ చెబుతోందని వేదాలు చెబుతున్నట్టు వేద పండితులు తెలిపారు..