కలియుగ వైకుఠం అనగానే భక్తులకు తిరుమల (Thirumala) గుర్తుకు వస్తోంది. అందుకే అ వెంకటనాధుడు కొలువైన ఏడుకొండలపై జరిగే ప్రతి ఉత్సవం బ్రహ్మోత్సవంగా భావిస్తారు శ్రీవారి భక్తులు. ఇకపోతే ఈ సంవత్సరం శ్రీవారికి రెండు బ్రహ్మోత్సవాలు వచ్చాయి. అందులో ఇప్పటికే సాలకట్ల బ్రహ్మోత్సవాలు (Salakatla Brahmotsavam) పూర్తయ్యాయి. కాగా నవరాత్రి బ్రహ్మోత్సవాలు అక్టోబరు (October) 15 నుంచి 23వ తేదీ వరకు వైభవంగా నిర్వహించడానికి సన్నాహాలు చేస్తుంది టీటీడీ.
బ్రహ్మోత్సవాలకు అంకురార్పరణ ఈ నెల 14న జరగనుంది. తర్వాత జరిగే తిరుచ్చి ఉత్సవం, పెద్ద శేష వాహనం15వ తేదీన, చిన్న శేష వాహనం, హంస వాహనం 16న, సింహ, ముత్యపు పందిరి వాహనం17న, కల్పవృక్ష వాహనం, సర్వభూపాల వాహన సేవలు18న జరగనున్నాయి.
అక్టోబర్ 19న మోహినీ అవతారం, గరుడ వాహనం, 20న హనుమంత వాహనం, పుష్పక విమానం, గజ వాహనం, 21న సూర్య ప్రభ వాహనం, చంద్ర ప్రభ వాహనం, 22న స్వర్ణ రథం, అశ్వ వాహనం, 23వ తేదీలలో చక్రస్నానం జరుగనున్నాయి. ఉదయం వాహనసేవ 8 నుండి 10 గంటల వరకు, రాత్రి వాహనసేవ 7 నుండి 9 గంటల వరకు, గరుడవాహనసేవ రాత్రి 7 నుండి 12 గంటల వరకు జరుగుతున్నట్టు టీటీడీ వెల్లడించింది.
ఇక సెప్టెంబర్ మాసంలో 21.01 లక్షల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారని, హుండీ ద్వారా 111కోట్ల 65లక్షల ఆదాయం లభించిందని అధికారులు తెలిపారు. ఈ మాసంలో కోటి 11లక్షల లడ్డులను భక్తులకు విక్రయించడమే కాకుండా 53.84లక్షల మందికీ అన్నప్రసాద వితరణ చేశామని, 8.94 లక్షల మంది తలనీలాలను సమర్పించినట్టు టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు.