Telugu News » Tirumala: శ్రీవారి భక్తులకు గమనిక.. ప్రత్యేక దర్శన టికెట్లు విడుదల..!

Tirumala: శ్రీవారి భక్తులకు గమనిక.. ప్రత్యేక దర్శన టికెట్లు విడుదల..!

రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం, వసతి గదులు, శ్రీవారి సేవ కోటా టోకెన్లను ఇవాళ(శనివారం) ఉదయం 10గంటల నుంచి టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు.

by Mano
Tirumala: Note to Srivari Devotees.. Special Darshan Tickets Released..!

తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ(TTD) గుడ్‌న్యూస్ చెప్పింది. మే నెలకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా(Special Entry Darshan Tickets)ను విడుదల చేస్తోంది. రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం, వసతి గదులు, శ్రీవారి సేవ కోటా టోకెన్లను ఇవాళ(శనివారం) ఉదయం 10గంటల నుంచి టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేసింది.

Tirumala: Note to Srivari Devotees.. Special Darshan Tickets Released..!

మే నెలకు సంబంధించిన అంగప్రదక్షిణం, వృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘ‌కాలిక వ్యాధులున్న‌వారి కోటా టోకెన్లు అందుబాటులో ఉండనున్నాయి. అదేవిధంగా తిరుమల, తిరుపతిల‌లో మే నెల గదుల కోటాను ఫిబ్రవరి 24న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు. ఫిబ్రవరి 27న శ్రీవారి సేవ కోటా విడుదల చేయనున్నారు.

ఫిబ్రవరి 27న ఉదయం 11 గంటలకు శ్రీవారి సేవ, మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు న‌వ‌నీత సేవ, మ‌ధ్యాహ్నం 2 గంట‌ల‌కు ప‌ర‌కామ‌ణి సేవ కోటాను ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నారు. భక్తులు ఈ విషయాలను గమనించి బుక్ చేసుకోవాలని టీటీడీ సూచించింది. శుక్రవారం అంగప్రదక్షిణం టోకెన్లు విడుదల చేస్తారు.

ఈ మేరకు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు భక్తులను అలర్ట్ చేశారు. ఈ విషయాలను గమనించి ఆన్‌లైన్‌లో ప్రత్యేక దర్శన, గదుల టికెట్లను బుక్ చేసుకోవాలని సూచించారు. భక్తులు https://ttdevasthanams.ap.gov.in వెబ్‌సైట్‌లో ముందస్తుగా దర్శన టికెట్లు, గదులను బుక్ చేసుకోచ్చని టీటీడీ అధికారులు వెల్లడించారు.

You may also like

Leave a Comment