వివాదాస్పద దర్శకుడు(Director) రాంగోపాల్‌వర్మ(Ram Gopal Varma) తెరకెక్కించిన ‘వ్యూహం’(Vyuham Movie) సినిమా విడుదలకు మళ్లీ బ్రేక్ పడింది. ఆ సినిమా సెన్సార్ సర్టిఫికెట్ రద్దు చేయాలంటూ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది.
పిటిషనర్ అభ్యర్థనను ధర్మాసనం ఏకీభవించి ‘వ్యూహం’ సినిమా సెన్సార్ సర్టిఫికెట్‌ను రద్దు చేసింది. అంతేకాదు సినిమాను మరోసారి రివ్యూ చేయాలని సెన్సార్ బోర్డుకు ఆదేశాలు జారీ చేసింది. నివేదిక ఇవ్వాలని కమిటీకి సూచనలు చేసింది.
మూడు వారాలు పాటు విచారణ వాయిదా వేస్తూ హైకోర్టు ఆదేశించింది. దర్శకుడు ఆర్జీవీ తెరకెక్కించిన ‘వ్యూహం’ సినిమాలో వివాదాస్పద సీన్లు ఉన్నాయని ఆ సినిమాను నిలిపివేయాలని పలువురు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అటు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కూడా తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
తన తండ్రిని, తనను కించపరుస్తూ అసభ్యకర సీన్లు చిత్రీకరించారని పిటిషన్ దాఖలు చేశారు. ఈ సినిమా సెన్సార్ సర్టిఫికెట్‌ను రద్దు చేయాలని లోకేశ్ హైకోర్టును కోరారు. ఈ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ సాగింది. ఇరువర్గాలు తమ వాదనలు వినిపించారు. దీంతో సెన్సార్ బోర్డుకు హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.